Home / Entertainment / ‘నేను లోకల్’ అంటున్న నాని

‘నేను లోకల్’ అంటున్న నాని

Author:

నాని ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత బిజీ హీరో అంటే ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలు లైన్ లో ఉంటున్నాయి. దానికి కారణం గడిచిన సంవత్సరంనర కాలంలో వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చాడు. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ రావడం, అలాగే నాని సినిమా అంటేనే మినిమమ్ గ్యారెంటీ సినిమా అని ఇటు ప్రేక్షకులు అటు సినిమా వారు ఫిక్స్ అయ్యారు. దానితో మనోడు ఈ మధ్యనే తన రెమ్యునేషన్ కూడ భారీగా పెంచాడు. ఇదే విషయాన్ని నాని కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి సినిమా మజ్ను ఇంకా పూరి కాకుండానే మరో సినిమా స్టార్ట్ చేశాడు. ఆ సినిమానే  ‘నేను లోకల్’.

nani next movie nenu local

దిల్ రాజు నిర్మాతగా ఆ మధ్య “సినిమా చూపిస్తా మామ” అంటూ అందరిని అలరించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. ఈ సినిమాలో నానికి సరసన నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ … ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా, తమ సంస్థకు, నానికి మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

(Visited 57 times, 1 visits today)