Home / Entertainment / నాన్నకు ప్రేమతో సినిమా లేట్ అవ్వనుందా?

నాన్నకు ప్రేమతో సినిమా లేట్ అవ్వనుందా?

Author:

nanna ku prematho

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అంతకు ముందు సినిమాలు వరుసగా నిరాశపరిచాయి ఒక టెంపర్ సినిమా మాత్రం పర్వాలేదు, కానీ అది తారక్ రేంజ్ సినిమా కాదు దీనితో ఇప్పుడు ఒక బ్లాక్ బ్లాస్టర్ హిట్ కావాలి ఈ సమయంలో కెరీర్ కి చాలా కీలకంగా మారిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’. అంతకు ముందు సుకుమార్ ‘1 నేను ఒక్కడినే’ కూడా నిరాశపరుచడంతో సుకుమార్ కి కూడా ఈ సమయంలో హిట్ కావలసి వచ్చింది.

ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా మరియు ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న 25వ సినిమా కావడం వలన సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎన్.టి.ఆర్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలను పొందు పరుస్తూనే సుకుమార్ చాలా స్టైలిష్ గా ఈ సినిమా తెరకెక్కించాడు. మరో రెండు రోజుల్లో ఈ చిత్ర టీం స్పెయిన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ కి తిరిగి రానుంది. ఇక్కడికి వచ్చాక మిగిలిన రెండు సాంగ్స్ ని షూట్ చేయనున్నారు.

ఈ చిత్రనికి దేవీశ్రీ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే,కానీ నిన్న హఠాత్తుగా దేవీశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో దేవీశ్రీ ప్రసాద్ ఇంకా ఈ సినిమా కోసం ఓ సాంగ్ ని కంపోజ్ చేసి ఇవ్వాల్సి ఉందట, ఈ పరిస్థితుల్లో ఆయన మళ్లీ పనిపై దృష్టి పెట్టలేడు కాబట్టి సినిమాని వాయిదా వేయడమే మేలని చిత్రబృందం భావిస్తోంది.

దానికితోడు కొంత భాగం సినిమా షూటింగ్ కూడా జరగాల్సి వుందట. ఇలా అన్నీ హడావుడిగా చేయడం కంటే కాస్త సమయం తీసుకోవడమే మేలన్న అభిప్రాయంతో చిత్రబృందం ఉందట. ఇదివరకు సుకుమార్ చేసిన `1` సినిమాని కూడా హడావుడిగా విడుదల చేశారు. ఆ ఎఫెక్ట్ సినిమాపై బాగా పడింది. అలాంటి తప్పుని మళ్లీ చేయకపోవడమే మేలని సినిమా మొత్తం పూర్తయ్యాక… అంతా ఓకే అనుకొన్నాకే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలిసింది.

(Visited 97 times, 1 visits today)