Home / Entertainment / సెన్సార్ (నాన్నకు) ప్రేమతో అల్ టైం ఇండస్ట్రీ హిట్.

సెన్సార్ (నాన్నకు) ప్రేమతో అల్ టైం ఇండస్ట్రీ హిట్.

Author:

Nannaku Prematho Poster

‘నాన్నకు ప్రేమతో’ ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే సినిమా గురించి మాట్లాడుకుంటుంన్నారు. ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రాబోతున్న సనగతి అందరికి తెలిసిందే..ఇప్పటికే మ్యూజిక్ సూపర్ హిట్ కావడం, అలాగే ట్రైలర్స్ యౌట్యూబ్ లో విడుదలైన కొద్ది గంటలొనే రికార్డ్స్ బ్రేక్ చేయడం తో సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమని ఫిక్స్ అయి పోయారు ఫ్యాన్స్..

తాజాగా దుబాయ్ సెన్సార్ సభ్యురాలు అయిన కౌరా సంధూ ఇచ్చిన సెన్సార్ రివ్యూ తో ఫ్యాన్స్ ముందుగానే సంక్రాంతి పండగా చేసుకుంటున్నారు..గతంలో కూడా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం చూసిన కౌరా సంధూ ఆ చిత్రం కూడా రికార్డు సృష్టిస్తుందని తెలిపింది. ఆమె అన్నట్టుగానే ఆ చిత్రం టాలీవుడ్ లో రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు కౌరా తన ట్విట్టర్ లో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా అద్భుతంగా వచ్చిందని, ఎన్టీఆర్ కెరీర్లో ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుందని , అంతే కాకుండా గత కొంత కాలంగా ఎన్టీఆర్ నుండి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఈ ‘నాన్నకు ప్రేమతో’ అల్ టైం ఇండస్ట్రీ హిట్ కావడం ఖాయమని ఆమె చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘నాన్నకు ప్రేమతో’ కూడా సూపర్ హిట్ అని చెబుతుండటంతో ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

(Visited 575 times, 1 visits today)