Home / Reviews / ‘నాన్నకు ప్రేమతో’ రివ్యూ & రేటింగ్.

‘నాన్నకు ప్రేమతో’ రివ్యూ & రేటింగ్.

Author:

Nannaku Prematho  Movie Perfect Review and Rating

ఇప్పుడు తెలుగు సినిమా తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. కథ, కథనం విషయంలోనైన, బడ్జెట్ లోనైన, కథకు ఎం కావాలో అది ఇస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తున్నారు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్ లలో సుకుమార్ వంటి స్టైలిష్ గా మేకింగ్ చేసే డైరెక్టర్స్ చాలా తక్కువ. సుకుమార్ ప్రేక్షకులకు ఐక్యూకి పరీక్ష పెడుతుంటాడు. ఒక్కోసారీ ఐక్యూ స్ధాయిని దాటి తెరపై విన్యాసాలు చూపిస్తాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25 వ చిత్రం గా ఎన్నో అంచానలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ఈ చిత్రం ఫై ఇండస్ట్రీ లోనే కాదు సామాన్య ప్రేక్షకులలో సైతం భారీగా అంచనాలు ఉన్నాయి..గత కొంత కాలంగా ఎన్టీఆర్ నుండి సరైన హిట్ రాకపోవడం తో ఎన్టీఆర్ తో పాటు ఫ్యాన్స్ కూడా ఆకలిగా ఉన్నారు..ఈ ఆకలిని ‘నాన్నకు ప్రేమతో ‘ తీరుస్తుందని గట్టి నమ్మకం తో ఇరువురు ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రి – కొడుకుల మధ్య అనుబంధాన్ని ఒక రివెంజ్ స్టొరీగా మార్చి చేసిన ఈ ‘నాన్నకు ప్రేమతో’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

మన హీరో అభిరామ్ (ఎన్.టి.ఆర్) ఒక లండన్ బేస్డ్ ఎన్ఆర్ఐ. తన ఇద్దరు అన్నయ్యలు, తండ్రి అయిన రమేష్ చంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్) యుుకే లోనే ఉంటారు. ఓసారి తను ఆఫీసు పనిమీద స్పెయిన్ లో ఉండగా తన జాబ్ పోతుంది అప్పుడే అభిరామ్ తండ్రి రమేష్ చంద్ర ప్రసాద్ కి ఆరోగ్యం బాలేదని తెలియగానే ఉన్నపళంగా బయలుదేరి వస్తాడు. తన చివరి రోజులు సంతోషంగా గడపమని డాక్టర్స్ చెప్పడంతో బాధపడుతున్న తన కొడుకులకి రాజేంద్ర ప్రసాద్ మనం ఒక్కప్పుడు ఉన్నతంగా బతికామని, మనం ఈ స్థితికి రావడానికి కారణం కృష్ణమూర్తి (జగపతిబాబు) చెబుతాడు. అప్పుడే రమేష్ చంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్) కోరికను నెరవేర్చడానికి తిరిగి లండన్ బయలుదేరుతాడు అభిరామ్. అక్కడ తన స్నేహితుల సహాయంతో కృష్ణమూర్తి గురించి తెలుసుకొని, తన కూతురు దివ్యాంక (రకుల్)ను ప్రేమలో పడేస్తాడు. దివ్యాంక ద్వారా ఎలా అభిరామ్ కృష్ణమూర్తిని రీచ్ అయ్యాడు. అలాగే కృష్ణమూర్తికి – అభిరామ్ కి మధ్య జరిగిన డిష్కషన్ ఏంటి.? వీరిద్దరూ ఒకరితో ఒకరు మొదలు పెట్టిన గేమ్ ఏంటి? ఆ గేమ్ లో గెలవడానికి ఎవరెవరు ఏం చేసారు? ఫైనల్ గా ఈ గేమ్ లో ఎవరు గెలిచారు? ఈ గేమ్ గెలిచే ప్రక్రియలో అభిరామ్ ఏం కోల్పోయాడు? కృష్ణమూర్తి రమేష్ చంద్ర ప్రసాద్ కు చేసిన ద్రోహం ఏమిటి? తండ్రి కోరిన కోరికను అభిరామ్ తీర్చాడా లేదా? అన్నది మిగత సినిమా..

అలజడి విశ్లేషణ:

ఎన్టీఆర్ ఓ గొప్ప స్టార్‌, కోట్లాది అభిమానుల్ని త‌న వైపుకు తిప్పుకోగ‌లిగే స్టార్ డ‌మ్ ఉంది. త‌న 25వ సినిమా ఇది. దాంతో పాటు సుకుమార్‌కీ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఇద్ద‌రూ క‌లిస్తే.. అదిరిపోయే క‌థేదో రెడీ అయిపోయి ఉంటుంద‌నుకొంటారంతా. కానీ తండ్రిని మోసం చేసిన విల‌న్‌పై ఓ కొడుకు ప్ర‌తీకారం తీర్చుకొనే మామూలు క‌థ‌ని ఎంచుకొన్నాడు సుకుమార్‌. నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఎంచుకున్న సింపుల్ స్టొరీ లైన్ మొదటి మైనస్ గా చెప్పుకోవాలి. ఇలాంటి కథలు చాలా వచ్చాయి, ఇకపై కూడా వస్తునే ఉంటాయి.

సుకుమార్ కూడా ప్రతీ ఫ్రేమ్ చెక్కినట్లుగా అందంగా తీర్చిదిద్దాడు. కానీ ఈ సినిమాలో తన ఇంటిలిజెంట్ డైలాగ్స్ తో జనాలను క‌న్‌ఫ్యూజ్ చేశాడు. ఇంట్రవెల్ బ్యాంగ్‌, ప్రీ క్లైమాక్స్ స‌న్నివేశాల్లో సుకుమార్ మార్క్ క‌నిపిస్తుంది. మ‌ధ్య‌లో సినిమా అంతా కేవ‌లం ఎమోష‌న్ మీద క్యారీ అయ్యేదే. ఓ సీన్ చూస్తే.. అర్థం కాదు. నాలుగైదు సీన్లు గ‌డిచాక‌… ఆ సీను ఎందుకు తీశాడా అనిపిస్తుంది. ఆ లింకు ప‌ట్టుకొంటే..సుకుమార్‌ని మెచ్చుకోకుండా ఉండ‌లేం.. కానీ దుర‌దృష్టం.. ఆ లింకు మిస్స‌యిపోతుంది. దాంతో.. సుకుమార్ ప‌డిన క‌ష్టం ఎలివేట్ కాలేదు. వ‌న్ లో క‌న్‌ఫ్యూజ్ స్ర్కీన్ ప్లేతో ఇబ్బంది పెడితే .. ఈసినిమాలో ఇంటిలిజెంట్ డైలాగ్స్ తో క‌న్‌ఫ్యూజ్ చేశాడు.

నటన పరంగా ప్రతి ఒక్కరూ అదిరిపోయే నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. అందులో ప్రధమంగా ఎన్.టి.ఆర్ – రాజేంద్ర ప్రసాద్ – జగపతి బాబుల అద్భుత నటన గురించే చెప్పుకోవాలి.. మొదటగా ఓ మాస్ ఇమేజ్ ఉన్న హీరో అయ్యుండి ఇలాంటి ఓ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేసినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. సినిమా అయ్యాక ఎన్.టి.ఆర్ అద్భుతమైన నటనని కనబరిచాడు అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. మొదటగా ఎన్.టి.ఆర్ లుక్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఆన్ స్క్రీన్ ఎన్నారై పాత్రకి తగ్గట్టుగా లుక్ అండ్ స్టైలింగ్ మార్చేశాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ సినిమాకి కీలకమైన తండ్రి పాత్రలో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. ఇక పైకి కనిపించని నెగటివ్ షేడ్స్ ని చూపించడంలో, కళ్ళతోనే క్రూరత్వాన్ని ప్రకటించడంలో జగ్గుభాయ్ వావ్, ఏం చేసాడురా అనిపించుకున్నాడు. విలనిజంని చాలా క్లాస్ గా చూపినా, ఆడియన్స్ కి కావాల్సిన విలనిజంని చూపించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

రకుల్ ప్రీత్ సింగ్ జస్ట్ గ్లామర్ అని కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెప్పించింది. ఎన్నారై పాత్ర కావడంతో మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించడమే కాకుండా, చాలా కష్టపడి తన పాత్రకి తను డబ్బింగ్ చెప్పుకొని తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇక ఎన్.టి.ఆర్ కి సపోర్ట్ గా రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల తమ పాత్రలకి న్యాయం చేసారు. తాగుబోతు రమేష్, నవీన్ లు ఓకే అనిపించారు. నటుల విషయం పక్కన పెడితే సినిమా మొదలవ్వడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆ ఆ తర్వాత కథలో వచ్చే లవ్ ట్రాక్, పాటలతో చాలా జాయ్ ఫుల్ ఫీల్ ని కలిగిస్తూ, సడన్ గా మొదలయ్యే హీరో-విలన్ మైండ్ గేమ్ ని స్టార్ చేసే ఇంటర్వల్ బాంగ్ జబర్దస్త్ అనిపిస్తుంది. నాన్నకు ప్రేమతోకి మేజర్ హైలైట్స్ అని చెప్పాల్సి వస్తే.. హీరో – విలన్ మైండ్ గేమ్ మరియు తండ్రి – కొడుకుల ఎమోషనల్ జర్నీ… ఇలా కథ – కథనం – నెరేషన్ విషయాల్లో సుకుమార్ ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది.

సుకుమార్ ఎప్పటిలానే లాంగ్ రన్ టైం పెట్టి ప్రేక్షకులకు కాసేపు బోర్ కొట్టించాడు. చెప్పాలంటే ఈ సినిమాని 150 నిమిషాల్లో ముగించొచ్చు, కానీ సెకండాఫ్ ని ఎక్కువ డ్రాగ్ చేయడం వలన అది కాస్తా 168 నిమిషాలయ్యింది. దాని వలన ప్రీ క్లైమాక్స్ వరకూ సినిమా పెద్ద ఆసక్తికరంగా నడిపించలేదు. సినిమా లో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ని ఎలా మోసం చేసాడో చూపించలేదు సరికదా చివరికి హీరో కూడా జగపతి బాబు వల్ల పోయిన వాళ్ళ నాన్న పరువుని తిరిగి నిలబెట్టినట్టు కూడా చూపించక పోవడంతో కామన్ ఆడియెన్స్ కి హీరొ గెలిచాడు అన్న ఫీలింగ్ రాదు. ఇంకా సినిమాలో నువ్వుకున్న సంధర్భాలు చేతి వేళ్ళపై లెక్కపెట్టుకోవచ్చు.

నటీనటుల పని తీరు:

ఎన్.టి.ఆర్ : ఎన్.టి.ఆర్ అద్భుతమైన నటనని కనబరిచాడు, ఎన్.టి.ఆర్ లుక్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఎన్.టి.ఆర్ అన్ని విషయాలలో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.

రకుల్ ప్రీత్: గ్లామర్ అని కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెప్పించింది. ఎన్నారై పాత్ర కావడంతో మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించడమే కాకుండా, చాలా కష్టపడి తన పాత్రకి తను డబ్బింగ్ చెప్పుకొని తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది.

రాజేంద్ర ప్రసాద్: కీలకమైన తండ్రి పాత్రలో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అండ్ సపోర్ట్ ఇచ్చాడు.

జగ్గుభాయ్: నెగటివ్ షేడ్స్ ని చూపించడంలో, కళ్ళతోనే క్రూరత్వాన్ని ప్రకటించడంలో జగ్గుభాయ్ వావ్, ఏం చేసాడురా అనిపించుకున్నాడు. విలనిజంని చాలా క్లాస్ గా చూపినా, ఆడియన్స్ కి కావాల్సిన విలనిజంని చూపించాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

సుకుమార్ కథ పరంగా కాకుండా కథనంలో మేజిక్ చేయాలని అనుకున్నాడు. కానీ అది సక్సెస్ అవ్వలేదు. కారణం నెరేషన్ ఊహాజనిత ఫార్మాట్ లో ఉండడం, అలాగే సెకండాఫ్ లో సాగదీయడం ఎక్కువ కావడం. దర్శకుడి ఊహాల్లోని విజువల్స్ ని తెరపైన ఒక ఫీల్ గుడ్ పెయింటింగ్ లా ఆవిష్కరించడంలో సినిమాటోగ్రఫీ విజయ్ కె చక్రవర్తి పనితనం అదరహో అనేలా ఉంది. విజువల్స్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన అన్ని పాటలు మంచి హిట్ అయ్యాయి. ఇక ఎమోషనల్ మరియు ఎలివేషన్ సీన్స్ లో తను అందించిన మ్యూజిక్ అదుర్స్. ఎస్. రవీందర్ ఆర్ట్ వర్క్ బాగుంది. లండన్ లో వేసిన స్పెషల్ ఆఫీస్ సెట్ సందర్భాలకు సింక్ అయ్యేలా ఉంది. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా భలే ఉంది అనిపిస్తే, సెకండాఫ్ ని మాత్రం బాగా సాగదీసాడు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ చివరి ప్రీ క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ ని మాత్రం బాగా ఎడిట్ చేసి కనెక్ట్ చేసాడు.

ప్లస్ పాయింట్స్:

  • ఎన్.టి.ఆర్ నటన
  • సినిమాటోగ్రఫీ
  • మ్యూజిక్
  • స్క్రీన్ ప్లే
  • లొకేషన్స్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ కథ
  • ఎడిటింగ్
  • లాంగ్ రన్ టైం
  • ఎంటర్‌టేన్‌మెంట్ లేకపోవడం

అలజడి రేటింగ్: 3/5

                                        పంచ్ లైన్ : కథ, కథనం పై ప్రేమ లేకపోవడం.

Must Read: Nannaku Prematho Movie 1st Day Collections.

(Visited 3,930 times, 1 visits today)