Home / Entertainment / అభిమానుల ఆనందం కోసం హై ఫీవర్ ఎంత – ఎన్.టి.ఆర్.

అభిమానుల ఆనందం కోసం హై ఫీవర్ ఎంత – ఎన్.టి.ఆర్.

Author:

Nannaku Prematho  Posters

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలోని చివరి సాంగ్ ని ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో చేస్తున్నారు.

సినిమాటోగ్రాఫర్ విజయ్ కె చక్రవర్తి ఎన్.టి.ఆర్ డెడికేషన్ చూసి తన ఫేస్ బుక్ లో ఇలా పోస్ట్ చేసాడు ‘హై లెవల్ వైరల్ ఫీవర్, బాడీ అంతా పెయిన్స్ అయినా కానీ ఏ మాత్రం కాంప్రమైజ్ అనేది లేకుండా ఎన్.టి.ఆర్ అందరినీ షాక్ చేస్తూ ఆదిరిపోయేలా స్టెప్పులు వేస్తున్నాడు. ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ మరియు అనుకున్నది చేయం కోసం ఏం చేయడానికన్నా సిద్దపడే మనస్తత్వం ఉన్నందువలనే ఎన్.టి.ఆర్ కి ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉంది. తన అభిమానులకి 100% బెస్ట్ ఇవ్వడం కోసం ఏం చేయడానికన్నా సిద్దపడతాడు. మీరు నిజమైన విన్నర్. సెల్యూట్ సార్’ అని . అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేయాలనీ ఎన్.టి.ఆర్ తన హెల్త్ కండిషన్ ని కూడా మర్చిపోయి అడిరిపోతే స్టెప్పులు వేస్తున్నాడట. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

(Visited 111 times, 1 visits today)