Home / Entertainment / సిక్స్ ప్యాక్ దేహంతో కనిపించబోతున్న నారా రోహిత్…

సిక్స్ ప్యాక్ దేహంతో కనిపించబోతున్న నారా రోహిత్…

Author:

తన మొదటి సినిమా నుండే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు యువ హీరో, నారా రోహిత్. ఇప్పటి వరకు కథ ఎన్నిక పరంగా, తన నటన ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచున్న ఈ హీరో, తన శరీరాకృతితో మెప్పించలేకపోయాడు. గత సంవత్సర కాలంలో అరడజను సినిమాలు చేసిన నారా రోహిత్ కు చెప్పుకోదగ్గ భారీ విజయం లభించలేదు. ఇప్పటివరకు తన అన్ని చిత్రాల్లో బొద్దుగా కనిపించిన రోహిత్, ఇక తన తదుపరి సినిమాలో ఏకంగా సిక్స్ ప్యాక్ తో కనిపించి అదరగొట్టనున్నాడు.

nara-rohit-six-pack

కొత్త దర్శకుడు ప్రవీణ్ మల్లాల దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేయడానికి నారా రోహిత్ పచ్చజెండా ఊపాడు. ఇంతవరకు తన శరీరాకృతి పై దృష్టి సారించని ఈ హీరో ఏకంగా సిక్స్ ప్యాక్ చేస్తుండటంతో అభిమానులకు తీపి వార్త. ఇందుకోసం స్పెషల్ ట్రైనర్ ఏర్పాటు చేసొవటమే కాక, ప్రతి రోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు జిమ్ లో కష్టపడుతున్నాడు. ఈ సినిమా నారా రోహిత్ కు మంచి విజయం విజయం సాధించిపెట్టాలని ఆశిద్దాం.

(Visited 200 times, 1 visits today)