Home / Entertainment / పాటల వేడుకకీ సిద్దం అవుతున్న తుంటరి

పాటల వేడుకకీ సిద్దం అవుతున్న తుంటరి

Author:
Source: Facebook- TuntariTheFilm

Source: Facebook- TuntariTheFilm

నారా రోహిత్‌ మొదటి సినిమా బాణం, తర్వాత సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న తుంటరి అనే సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క‌థ‌ను అందించిన సినిమా ఇది. నారా రోహిత్ ప‌క్క‌న ల‌తా హెగ్దే నాయిక‌గా న‌టిస్తోంది. గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ కీర్తి ఫిలిమ్స్ భ్యానర్ పై అశోక్ బాబా, నాగార్జున్ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్‌తో క‌నిపిస్తారు. ఈ సినిమా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతున్న‌ట్టు చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు.ఈ చిత్రనికి మ్యూజిక్ సాయికార్తీక్‌ అందిచాడు..త్వరలో పాటలను గ్రాడ్ గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తేలియజేశారు.

tuntari

(Visited 51 times, 1 visits today)