Home / Entertainment / తుంటరి సినిమా పాటలు విడుదల చేసిన రేవంత్ రెడ్డి.

తుంటరి సినిమా పాటలు విడుదల చేసిన రేవంత్ రెడ్డి.

Author:

నారా రోహిత్ ఇప్పుడు వరుస సినిమాతో తెలుగులో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. అందుకు కారణం తన దగ్గర ఇప్పటికి 6 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు ముందుగా తుంటరి చేష్టలతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు గుండెల్లో గోదారి సినిమాతో పరిచయం అయిన కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తునాడు. ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై అశోక్ బాబా,నాగార్జున నిర్మించారు. నారా రోహిత్, లతా హెగ్డే జంటగా నటిస్తుంది. ఈ సినిమాలో రోహిత్ కాస్తా బరువు తగ్గి చాలా స్టైలిష్ గా అగుపిస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియో లాంచ్ శుక్రవారం నాడు హైదరాబాద్ లో నిర్వహించారు. దినికి ముఖ్య అతిధిగా తెలంగాణా టిడిపి నేత రేవంత్ హాజర్ అయ్యారు వీరితో పాటు వి.వి.వినాయక్, తారకరత్న, సాయి కార్తీక్ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా యొక్క ఆడియోతో పాటు ఈ చిత్ర థియేటట్రికల్ ట్రైలర్ కూడా రేవంత్ రెడ్డి విడుదల చేసాడు.

ఆడియో లాంచ్ అనంతరం రేవత్ రెడ్డి మాట్లాడుతూ…. మొదటి సినిమాతో భాణం వేసి ఆ తర్వాత ప్రతినిధిగా నిరుపించుకున్నాడు. ఇప్పుడు తుంటరి అయ్యాడు అంటు అక్కడ ఉన్నావారిని నవ్వించే ప్రయత్నం చేశాడు. అలాగే దిల్ సినిమాతో రాజుకు దిల్ రాజు అని ఎ విధంగా పేరు వచ్చిందో రోహిత్ కు కూడా తుంటరి రోహిత్ అని పేరు రావలని కోరుకుంటున్న అని అన్నారు. నందమూరి అంటే పౌరుషానికి మరో పేరు..నారా అంటే అంటే క్రమశిక్షణ… ఈ కుటుంబల నుండి ఎవరు వచ్చిన వారు ప్రేక్షకుల ఆభిమానాన్ని చూరకోంటారు. ప్రపంచంలో పెద్ద సైన్యం అయిన అమెరికా సైన్యం ముప్పై లక్షలు అయితే ఇక్కడ టిడిపి సైన్యం ఆరవై లక్షలు. టిడిపి కార్యకర్తలు అందరు కలసి సినిమాను రెండుసార్లు చూస్తే చాలు ఇంకేవరూ రానక్కర్లేదు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని రేవంత్ అన్నారు.

(Visited 160 times, 1 visits today)