Home / Reviews / నరుడా డోనరుడా రివ్యూ & రేటింగ్

నరుడా డోనరుడా రివ్యూ & రేటింగ్

Author:

naruda-donaruda-movie-review

అక్కినేని వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన సుమంత్ మొదట్లో మంచి సినిమాలనే ఎంచుకున్నా ఆ తరువాత తాను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అవడంతో చాలా రోజులు గ్యాప్ తీసుకోని హిందీలో సూపర్ హిట్ అయిన బోల్డ్ కంటెంట్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. హిందీ సినిమా విక్కి డోనార్ ని తెలుగులో నరుడా డోనరుడా తీస్తే ఎలా ఉందొ చదవండి

కథ :
విక్కీ( సుమంత్) ఒక మధ్య తరగతి యువకుడు. తన అవసరాలకోసం ఏమైనా చేసే టైపు. చిన్న బ్యూటీ పార్లర్ నడిపి విక్కీ అమ్మ(శ్రీ లక్ష్మి) కుటుంబాన్ని నడుపుతుంది. ఆషిమా రామ్(పల్లవి సుభాష్)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. చివరికి ఎంతో కష్టపడి తన ప్రేమలోకి దింపుతాడు. సంతాన సాఫల్య కేంద్రం నడుపుతూ తన వద్దకు వచ్చే కష్టమర్లకు న్యాయం చేయలేక, బోర్డు తిప్పలేక ఒక మంచి వీర్య దాత గురించి వెదుకుతుంటాడు ఆంజనేయులు (తనికెళ్ళ భరణి). ఆలాంటి సమయంలో అనుకొంకుండా విక్కీ కనబడుతాడు డాక్టర్ కీ. విక్కీ తాత ముత్తాతల గురించి ఎక్వేరి చేస్తే వారికి డజను మంది పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. ఆ బీజాలు విక్కీలో ఉంటాయి కనుక వాటి తన ఆసుపత్రికి వాడుకోవాలని అనుకుంటాడు. ముందుగా స్పెర్మ్ డోనర్ అనగానే నిరాకరించిన విక్కీ తరువాత తన అవసరాల కోసం స్పెర్మ్ డోనర్ గా మారుతాడు. తర్వాత తను ఏల ఆషిమాను దక్కించుకుంటాడు, వాళ్ళ సంసారం ఎలా సాగుతుండో, విక్కీ దాచిన నిజం ఆషిమాకు ఎలా చెప్టాడో అనేది తెరపైనే చూడాలి.

అలజడి విశ్లేషణ :

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాని ఇక్కడ డబ్ చేస్తే పరవాలేదు కానీ రీమేక్ చేశారు. ఈ సినిమా కథ చాలా మందికి తెలుసు కాబట్టి కథనంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అలాంటి సంఘటనలు అంతగా జరుగలేదని చెప్పాలి. ఈ సినిమా కంటెంట్ బోల్డ్ గా ఉన్న మన తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా చెప్పడంలో దర్శకుడు నెమ్మదించాడు. ఇక మొదటి భాగంలో స్పెర్మ్ డొనేట్ చేసే సమయంలో డబ్బాలో దానికి పట్టుకొచ్చే సన్నీవేశాలు కొద్దిగా అతిగా ఉంటాయి. అలాంటి సమయంలో కొన్ని మాటలు అతిగా ఉండటం వలన వినడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది.ఇక అత్తా కోడళ్ళు కలసి మందు కొట్టడం లాంటి సన్నీ వేశాలు మన ప్రేక్షకులు జీర్ణించుకోలేరు అని చెప్పాలి. హీరో హీరోయిన్స్ విడిపోయే సన్నివేశంలో కొద్దిగా ఎఫెక్టివ్ గా చూపిస్తే బాగుండేది.

ఇక మొదటి భాగంలో చూసిన కథనే మళ్ళీ రెండవ భాగంలో చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక పిల్లలు లేరని బాధపడే తల్లుల సన్నీ వేషం కొద్దిగా కనెక్ట్ అయ్యే విధంగా చూపిస్తే ఆ సన్నివేశం ఈ సినిమాలోనే ఒక మంచి సన్నివేశంగా మిగిలిపోయేది కానీ అది కుదరలేదు.మొత్తానికి ఈ సినిమాను ‘ఏ’ కాన్సెప్ట్ అనుకోని తీశారో మనకు అర్ధం అవుతుంది. చాలా చిన్న బడ్జెట్ లో తీశారు కాబట్టి ఈ సినిమా పెట్టుబడి మాత్రం వెనక్కి వచ్చేస్తుంది.

నటీనటుల పనితీరు:
సుమంత్ తనకు తగిన పాత్రనే ఎంచుకున్నాడు. కొన్ని ఎమోషన్స్ సన్నీ వేషాలలో మంచి నటన కనబరిచాడు. తొలి భాగంలో చలాకీగా కనిపించి అక్కడక్కడా కొద్దిగా అతి చేసినట్టు అనిపిస్తుంది. ఇక ప‌ల్ల‌వి బాగానే ఉంద‌నుకోవాలి. ఆల్రెడీ పెళ్ల‌యి, విడాకులు తీసుకొన్న క్యారెక్ట‌ర్ కాబ‌ట్టి.. ఈ మాత్రం కొద్దిగా ఏజ్ ఉండాల్సిందే అని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించి ఉంటారు. మ‌రో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించిన త‌నికెళ్ల భ‌ర‌ణి… కొన్ని స‌న్నివేశాల్లో ఓవ‌ర్ యాక్టింగ్‌ తో ఇబ్బంది పెడ‌తాడు.

సాంకేతిక వర్గం పనితీరు:
హిందీ సినిమా విక్కీ డోన‌ర్‌లో ఉన్న‌ట్టుగా తీయ‌డానికే ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ శతవిధాలుగా శ్ర‌మించాడు. సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌ల చాతుర్యం బ‌య‌ట‌ప‌డింది. ఇక ‘విత్తనం’ అనే ప‌దాన్ని ర‌క‌ర‌కాలుగా వాడి కొన్ని న‌వ్వులు పంచారు. పాట‌లు విషయానికి వస్తే ఏ ఒక్క పాట కూడా గుర్తుంచుకొనేలా లేవు. . కెమెరా ప‌నితనం బ‌డ్జెట్ ప‌రిమితుల‌కు, ప‌రిధుల‌కు లోబ‌డే ఉంది. .

ప్లస్ పాయింట్స్ :
. సుమంత్
. తనికెళ్ల భరణి
. ఫస్టాఫ్ లో కామెడీ

మైనస్ పాయింట్స్ :
. మాటలు అతిగా ఉండటం
. తెలుగు నెటివిటీకి సూట్ అవ్వకపోవడం
. మ్యూజిక్

అలజడి రేటింగ్: 2.5/5

పంచ్ లైన్: మన ప్రేక్షకులకు ఏమాత్రం సూటు కానీ  డోనరుడు

(Visited 2,628 times, 1 visits today)