Home / Entertainment / జై బాలయ్య అంటున్న నాని.

జై బాలయ్య అంటున్న నాని.

Author:

Nani Jai Balayya Movie

నందమూరి నటసింహం అభిమానిగా నేచురల్ స్టార్ నాని ఓ మూవీ చేస్తున్నాడు.ఈ ఏడాది 2015 నాని కెరీర్ లో ది బెస్ట్ అనాల్సిందే. ఏళ్ల తరబడి ఎదురుచూసిన బ్రేక్.. నానికి ఈ సంవత్సరమే వచ్చింది. చాలాకాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్న నాని.. భలేభలే మగాడివోయ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. లో బడ్జెట్ మూవీగా వచ్చి మీడియం బడ్జెట్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించిది. అందాల రాక్షసి తీసి ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ‘జై బాలయ్యా’ చిత్రానికి సంబంధించి బోలెడు అప్ డేట్స్ బయటకు రానున్నాయి. 2016 న్యూ ఇయర్ రోజున ఫస్ట్ లుక్ నుంచి అనేక సంగతులు వెల్లడించనున్నాడు నాని. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని జనవరి 1న విడుదల చేసి ఆడియో వేడుకను జనవరి 10న నిర్వహించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను.. సంక్రాంతికి రిలీజ్ కానున్న భారీ చిత్రాలతో పాటు థియేటర్లలో ప్రదర్శించి.. మరింత హైప్ తెచ్చేందుకు ప్లాన్ చేశారు. కాగా.. తన లేటెస్ట్ మూవీ ఫిబ్రవరి 5న థియేటర్లలోకి తీసుకురావాలని నాని నిర్ణయించుకున్నాడు. ఇప్పటి వరకూ విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ తో సినిమా చేసిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ప్రస్తుతం యువతలో క్రేజ్ ఉన్న యంగ్ హీరో ని బుక్ చేసారు.

నాని దాదాపు ఏడేళ్ళ తర్వాత తనను సిని పరిశ్రమకు పరిచయం చేసిన డైరెక్టర్ తో కలిసి పనిచేయనున్నారు. ఇంద్రగంటి సినిమాతో నాని తెలుగు తెరకు పరిచయం కాగా ఇప్పుడు ఆయన డైరెక్షన్ లోనే తన తర్వాతి సినిమా చేయనున్నారు నాని. హను రాఘవపూడి చిత్రం ఇటీవలే పూర్తి కాగా వెంటనే ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సిద్దమయ్యారు నాని.ఈ చిత్రం ప్రేమకథ, థ్రిల్లింగ్, కామెడీ కలిసి ఉన్న కథ నేపధ్యంతో తెరకెక్కుతున్నట్టు సమాచారం.

(Visited 167 times, 1 visits today)