Home / health / చింత గింజలతో మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని చాలా సులభంగా తగ్గించవచ్చు.

చింత గింజలతో మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని చాలా సులభంగా తగ్గించవచ్చు.

Author:

ఒక్కప్పుడు ముసలి వారు మాత్రమే మోకాళ్ళ నొప్పులతో కృష్ణ రామ అంటూ చాలా భాదతో తిరిగేవారు ఎందుకంటే ముసలి వయస్సు వచ్చే సరికి మోకాళ్ళలో ఉన్న ఎముకల అరుగుదల మొదలవుతుంది కాబట్టి, కానీ ఇప్పుడు నడి వయస్సు వారు కూడా మోకాళ్ళు, కీళ్లు, ఎముకల్లో గుజ్జు అరిగిపోవడం వలన నొప్పులతో బాధపడుతున్నారు. 30 ఏళ్లకే కీళ్ల నొప్పులతో చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు, దానికి కారణం సరైన పోషాకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడమే. దానితో ఇప్పుడు హాస్పిటల్స్ చూట్టు తిరుగుతూ లక్షల్లో ఖర్చు చేసుకుంటున్నారు.కానీ మన ఇంట్లోనే తయా రుచేసుకోగలిగే ఒక మిశ్రమం ద్వారా దృఢమైన ఎముకలను పొందవచ్చు అని మీకు తెలుసా…! ఆ మిశ్రమమే చింత గింజలతో తయారు చేసిన పొడి.

Natural-Treatment-for-knee-pain

చింతగింజల మిశ్రమాన్ని తయారుచేయు విధానం:

  • ముందుగా చింత పండు నుండి చింత గింజలను వేరు చేసి వాటిని బాగా వేయించి నీటిలో రెండు రోజులు నానబెట్టాలి.
  • నానబెట్టిన చింత గింజలను బాగా పిసికి వాటి తొలుసును తీసి ఎండబెట్టాలి.
  • ఎండిన చింత గింజలను పొడిరూపంలో చేసుకోవాలి అంటే బాగా రుబ్బాలి, రుబ్బిన పౌడర్ని భద్రపర్చుకోవాలి.
  • ఈ పౌడర్ ని రోజు ఒక చెంచా తగినంత మంచినీటిలో కలుపుకొని అందులో కొన్ని పాలుపోసి తగినంత చక్కర వేసుకొని పాయసంలా రోజు తాగాలి.
  • ఇలా రోజు చేయడం వలన 30 రోజులలో మోకాళ్ళు చాలా బలంగా తయారు అవుతాయి.అదే విధంగా కరిగిపోయిన మోకాళ్ళ గుజ్జు తిరిగి చేరుతుంది

Natural-Treatment-for-knee-pain

చింత గింజలలో ఎముకలకి బలాన్ని చేకూర్చే వివిధ రకాల ఔషదాలు ఉంటాయి, కీళ్ళలో అరిగిపోయిన గుజ్జును మళ్ళీ వచ్చేలా చేస్తాయి, ఈ మిశ్రమం తాగడం వలన కీళ్ల నొప్పులతో పాటు డ‌యేరియా, చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధ స‌మ‌స్య‌లు, అజీర్ణం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు, ఈ పద్దతిని ఆయుర్వేద వైద్యంలో చాలా విరివిగా ఉపయోగిస్తారు, విరిగిపోయిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి విరిగిన చోట ఈ చింత గింజల మిశ్రమాన్ని పేస్ట్ లాగ చేసి పూస్తారు.

(Visited 12,122 times, 1 visits today)