Home / health / పక్షవాతానికి అద్భుతమైన వైద్యం అందిస్తున్న కర్నూల్ వాసి.

పక్షవాతానికి అద్భుతమైన వైద్యం అందిస్తున్న కర్నూల్ వాసి.

Author:

పక్షవాతం ఈ పేరు చెబితే ఆరోగ్యంగా ఉన్నవారు కూడా భయపడిపోతుంటారు. ఎందుకంటే మనిషిని బతికుండగానే చనిపోయిన శవంలా చేస్తుంది ఈ వ్యాధి. ఈ వ్యాధి ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి బ్రతికున్న ఏదైనా ఒక సమయంలో వస్తుంది. ఈ ప్రపంచం మొత్తంలో ప్రతి ఆరు సెకెండ్లకు ఒకరు పక్షవాతంతో మృతి చెందుతున్నారు. మన దేశంలోనూ ఈ వ్యాధి వల్ల రోజుకు రెండు వేల మంది చనిపోతున్నారు అంటే మీరు నమ్ముతారా!. ఈ ఆధునిక టెక్నలాజి ఉన్న రోజులలో కూడా దీనికి సరైన పూర్తీ చికిత్స లేదంటే మీరు నమ్ముతారా! కానీ కర్నూలు జిలాల్లో తన తండ్రి నుంచి నేర్చుకున్న విద్య ద్వారా ఒక వ్యక్తి పక్షవాతం వ్యాధి నుండి తిరిగి మామూలు మనుషులను చేస్తున్నాడు అనే కంటే పరిగెత్తిస్తున్నాడు అంటే మంచిదేమో.

natural-treatment-for-peralysis

కర్నూలు జిల్లా నంద్యాల నుండి కోవెల కుంట్లకు వెళ్లే దారిలో ఉమాపతి నగర్ దగ్గర ఎప్పుడు చూసినా పక్షవాతం వచ్చినవారు వారికి తోడుగా వచ్చినవారితో నిత్యం రద్దీగా ఉంటుంది. దానికి కారణం అక్కడ పసరు మందుపోసే హరిబాబు మహత్యం అనే చెప్పాలి. ఈ ప్రాంతానికి మన తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుండి కూడా ఎందరో ఈ వైద్యం కోసం వస్తారు. ఈ ఆసుపత్రి ఉదయం 5 గంటలనుండి రాత్రి పది గంటల వరకు వ్యాధిగ్రస్తులకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కేవలం పసరు మందుతో పక్షవాతం ఉన్నవారికి మోక్షం కలిగిస్తున్నారు. ఈ పసరు మందు తీసుకునేవారు మూడు రోజుల పాటు ఇక్కడే ఉంచుతారు. ఈ మందుకు ఎలాంటి ఫీజు తీసుకోరు.


ఇక చికిత్స చేసే విధానానికి వస్తే … మొదటి రోజు వెల్లుల్లిని రోట్లో దంచి రసం తీసి అందులో బెల్లం కలిపి పక్షవాతం వచ్చిన వారికి తాగిపిస్తారు. అలాగే రెండవ రోజు హరిబాబు స్వయంగా తయారు చేసిన రసాన్ని రోగి చెవిలో పోస్తాడు. ఈ రసం రోగి వ్యాధి తీవ్రతను బట్టి పసరు తయారు చేస్తాడు హరిబాబు. ఇక చివరి మూడవ రోజు కంట్లో మందు వేస్తారు. పసరు తీసుకున్న మూడు నెలలు కచ్చితంగా పత్యం పాటించాల్సి ఉంటుంది. పత్యం చేసే రోజుల్లో కారం, ఆవునెయ్యితో మాత్రమే అన్నం తినవలసి ఉంటుంది. అలాగే హరిబాబు ఇచ్చిన తైలంతో చచ్చుపడిన కాళ్ళు, చేతులు, ముఖానికి మర్దన చేసుకోవాలి.. ఇలా చేస్తే మూడు నెలల లోపే పక్షవాతం వచ్చిన మనిషి పరిగెత్తగలడు…. పెద్ద, పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలలో కూడా నయం కాకపోవడంతో ఇక్కడకి వస్తున్నారు. ఇక ఇక్కడికి వచ్చిన అందరికి నయం కావడంతో ప్రజలు రోజు రోజుకి వందల నుండి వేల సంఖ్యల్లో వస్తున్నారు. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ సమాచారాన్ని అందించి వారికి తిరిగి మామూలు జీవితాన్ని ఇవ్వండి…

(Visited 6,612 times, 1 visits today)