Home / Entertainment / నవ్వుల దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నవ్వుల దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Author:

రెండున్నర గంటల పాటు ఏ డైరెక్టరైనా ఆపకుండా నవ్వించగలరా అంటే  ఒకప్పుడున్న పేరు జంధ్యాల ఐతే ఇప్పుడు చెప్పుకోదగ్గ పేరు శ్రీను వైట్ల. కథ మీద ఎంత పట్టు తో సినిమాని నడిపిస్తారో అదే చిత్త శుద్దితో స్క్రిప్టున్లో కామెడీని కూడా చూసిన ఒకే ఒక దర్శకుడు. 1999 లో వచ్చిన నీకోసం నిరాశపరిచినా 2001 లో “ఆనందం” తో పాపులర్ అయిన శ్రీను వైట్ల తూ.గో.జీ. నవ్వుల తత్వాన్ని సినిమాల్లో నింపేసి చప్పట్లుకొట్టించుకున్నాడు. కామెడీ అంటే మామూలుగా కాదు మరి పొట్ట చెక్కలు కావాల్సిందే….

నవ్వుల దర్శకుడి కొన్ని సీన్లు చూసి నవ్వేసుకుందాం  ఆనందం 1999 లో మొదటి సినిమా నీకోసం వచ్చినా శ్రీనుకి నిరాశనే మిగిల్చింది. కానీ ఆ వెంటనే వచిన సినిమా ఆనందం. అప్పటి యూత్ కామెడీ సినిమాలలో నెంబర్ వన్ గా నిలిచిందీ సినిమా చిత్రం శ్రీను, శివారెడ్డిలకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆనందమే… అందులోని మందు పార్టీ కామెదీ ని ఎప్పటికీ మర్చిపోలేం… రాంబాబు అనే పేరు వింటేనే నవ్వొస్తుంది ఇప్పటికీ..సొంతం ఇంకో యూత్ కామెడీ పిచ్చిపిచ్చిగా నవ్వి శ్రీను వైట్ల ని దీవించారు తెలుగు ప్రేక్షకులు నటులనే కాకుండా త్రికరణ శుద్ది గా స్క్రిప్టు నే నమ్ముకుని తీసిన ఈ సినిమా శ్రీనూ వైట్లని దర్శకుడిగా నిలబెట్టింది..  జిహా…ద్… ఒక్కని పిలిస్తే ఇంతమందొచ్చారేంట్రా అన్న ఎమ్మెస్ ఎక్స్ ప్రెషన్ మర్చిపొగలమా…

మాస్ మహా రాజ రవితేజ కి హీరోగా మొదటి సినిమా నిరాశపరిచినా వెంకీ తో హిట్ ఇచ్చాడు”ట్రయిన్లో పాడు గజాలా” అంటూ రవితేజా టీం చేసే అల్లరి మనల్ని నాన్స్టాప్ గా నవ్విస్తుంది…. “ఇలఖత మఫులియా”

అక్కడితో మన తూ.గో.జీ. కుర్రోడు స్టార్ డైరెక్టర్ గా మెగాస్టార్ నీ హాండిల్ చేయగలనని నిరూపించుకున్నాడు. గోవిందు పాత్రలో చిరూ తో కూడా సూటబుల్ కామెడీ చేయించి అందరి మన్ననలూ అందుకున్నాడు.. ‘గుడ్డెళ్ళి బండమీద పడ్డా బండెళ్ళి గుడ్డు మీద పడ్డా ఏమవ్వుద్దీ…?

 

ఇక ఆ తర్వాత వచ్చిన డీ,దుబాయ్ సీను ల సంగతి చెప్పనే అక్కర్లేదు నవ్వీ…నవ్వీ…నవ్వీ…నవ్వటానికి కూడా ఓపిక కావాల్రా బాబూ అనిపించాడు సీను బాబు ప్రతీ సినిమాలోనూ మందు పార్టీ సీను ఖచ్చితంగా పెట్టటం తనకో సెంటిమెంట్ ఐపోయినా డీ లో పెట్టిన సీను సితారే…

ఇక ఎక్కడా ఆగలేదు రెడీ తో రాం కి బ్రేక్ ఇచ్చి న శ్రీను వైట్ల కింగ్ తో మరో స్టార్ హీరోని డైరెక్ట్ చేసి పెద్ద హీరోలనీ హాండిల్ చేయగలనని నిరూపించుకున్నాడు… “తడిక తడిక తడిక….మ్యూజిక్ డైరెక్టర్ సూర్య ని ఎవరూ మర్చిపోలేరు”

 

ఇక 2011 లో వచ్చిన దూకుడు ఇంకా నవ్విస్తూనే ఉంది హీరోయిజం తో సమానం గా కామెడీ నీ నడిపించి శభాష్ అనిపించుకున్నాడు.. సీరియస్ కథలో అదే స్థాయిలో కామెడీని బ్యాలెన్స్ చేయటం కత్తిమీదసాము లాంటిది… ఐనా ఇరగ దీసాడు మనోడు..

 

ఇక అసలే యాంగ్రీ యంగ్ మాన్ అయిన ఎంటీఆర్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు అసలు కథే పిచ్చిసీరియస్ గా ఉండే సబ్జెక్ట్ దీనిలో కూడా అదే సీరియస్ నెస్స్ ని మెయింటెయిన్ చేస్తూచెస్తూనేకామెడీ పండించాడు.. ఆ తర్వాత వచ్చిన “ఆగడు” లో కామెడీ పర్వాలేదని పించినా శ్రీను వైట్ల కెరీర్ లో మొదటి సినిమా తరవాత పెద్ద ఫ్లాప్ గానే మిగిలింది

 

ఇప్పుడు బ్రూస్ లీ తో మళ్ళీ నవ్వించటానికి చరణ్ ని సిద్దం చేస్తున్నాడూ శ్రీనూ వైట్ల ఫుల్ యాక్షన్ లో కూడా నవ్వుల తుఫాన్ సృష్టించే ప్రయత్నాల్లో ఉన్న శ్రీను బాబు కి హ్యాపీ బర్త్ డే తో పాటు బ్రూస్ లీ కోసం ఆల్ దిబెస్ట్ కూడా చెప్తోందీ అలజడి టీం.

(Visited 164 times, 1 visits today)