Home / Inspiring Stories / మోడీకి పాకిస్థాన్ ప్రధాని ఫోన్ కాల్.

మోడీకి పాకిస్థాన్ ప్రధాని ఫోన్ కాల్.

Author:

Narendra Modi

** గిల్లి జోల పాడటం అంటే ఇదేనేమో. అసలు పఠాన్ కోట్ దాడి వెనక ఉన్న కారణం పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ అన్న వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఆయనకు కు ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాకిస్తాన్ పర్యటన నచ్చలేదట. మోడీ పాక్ వెళ్లడం, ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లిలో పాల్గొనడం, ఆయన తల్లికి పాదాభివందనం చేయడం ఏ మాత్రం నచ్చలేదట. అందుకే పాక్ గూడాఛార సంస్థ ఐఎస్ఐ తో మాట్లాడి భారత్ లో విధ్వంసకర దాడి చేయాలని, రెండు దేశాల మధ్య సత్సంబంధాలను చెడగొట్టి భారత్ కు తీవ్ర నష్టం కలగ జేయాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. దాడిలో మరణించిన ఉగ్రవాదుల బూట్ల మీద పాక్ సైన్యానివే అన్న ఆధారాలు లబించటం,అరెస్ట్ అయిన మరో ముగ్గురి దగ్గర పాక్ సిం కార్డులు లభించటం చూస్తే ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందనే అర్థం ఔతోంది.

ఐతే ఈ నేపథ్యం లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈరోజు సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి కేసుకు పూర్తిగా సహకరిస్తామని నవాజ్ షరీఫ్ హామీ ఇచ్చారట. పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు దాడులు చేసిన తరువాత పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చెయ్యడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా పాక్ పై విమర్శల వెల్లువ మొదలైంది…

బ్రిక్స్ కూటమిలో ప్రధాన దేశమైన చైనా పఠాన్ కోట్ దాడిపై స్పందించింది. పఠాన్ కోట్ లోని భారత సైనిక వైమానిక స్ధావరంపై జరిగిన ఉగ్రవాద దాడి పొరుగు దేశాల మధ్య జరగనున్న చర్చలను చెడగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని చైనా చైనా ప్రభుత్వ ప్రతినిధి హువా చున్ యింగ్ వ్యాఖ్యానించారు.”అమెరికా కూడా పఠాన్ కోట్ దాడుల మీద పాకిస్తాన్ సరైన నిర్ణయం తీసుకొని ఉగ్రవాదం పై జరిగే పోరుకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం” అంటూ పాక్ మీద చురకలు వేసింది. అయితే ఇక్కడ పాక్ జోక్యాన్ని పూర్తిగా ఒప్పుకోక పోవటం గమనార్హం.

ఏదేమైనా ఉగ్రవాద చర్యలకు ప్రాణాలొడ్డిన వీర జవాన్ లను మాత్రం భారత ప్రజలు కోల్పోయారు. ఆ దు:ఖ ప్రభావం నుంచి ఇంకా పౌరులు తేరుకోలేదు…

(Visited 256 times, 1 visits today)