హై సొసైటీ పోకడలు ఉండే సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరిస్ ఎలా పుడతాయో.. ఎప్పుడు ఏ మలుపుతీసుకుంటాయో చెప్పడం కష్టం ఎందుకంటే. సినిమాల్లో ఉండే కథలకన్నా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి తారల నిజజీవితాలు. ఎప్పుడు తెగిపోతుందో తెలియని గాలిపటాల్లా ఉంటాయి ఇక్కడి రిలేషన్స్.
కెరీర్ ఆరంభం లో నయన తార , తమిళ స్టార్ శింబు తో కలసి కొన్ని చిత్రాలు చేసింది. ఈ సమయంలో ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. ఇద్దరూ డీప్ లిప్ లాక్ లతో లీనమై వున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. వీరిద్దరు కలసి నటించిన చిత్రాల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రి చూస్తే. కొత్తవారికైనా వారు ప్రేమలో ఉన్న సంగతి తెలిసి పోతుంది.అంతగా దగ్గరైన ఈ ప్రేమికుల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కట్ చేస్తే..! ఏడేళ్ల ప్రేమయాణం సాగించిన తరువాత..ఇద్దరూ ప్రేమని “తూచ్”అనుకొని బ్రేకప్ చెప్పుకున్నారు. జీవితాలే కాదు సినిమాల్లోనూ కలిసి కనిపించం అన్నారు. ఆ తర్వాత నయన తార సౌతిండియన్ డాన్స్ స్టార్ ప్రభుదేవాని వివాహమాడ బోతున్నట్టు వార్తలొచ్చాయ్. ప్రభుదేవా తన భార్యకి విడాకులిచ్చి నయన తార తో పెళ్ళికి రెడీ అయిపోయాడన్నారు. కానీ ఆ కథ కూడా అర్థాంతరంగా నే ముగిసింది.
ఐతే మళ్ళీ ఈ పాత జంట ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వార్తల్లోకెక్కింది. శింబు ప్రస్తుతం నయన తార తో కలిసి ’ఇదు నమ్మఆళు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రమే మరోసారి వీరి మధ్యన విభేధాలు పెరగటానికి కారణమవబోతోంది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం కొద్ది రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు నయన తార తాను ఇక సినిమాలో నటించనని తేల్చి చెప్పింద కారణాలూ సరిగా చెప్పలేదట. దాంతో మండిపడ్డ శింబు వేరే దారి లేక ఆమెపై కంప్లైంట్ చేసారట.
శింబు రీసెంట్ గా తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ని కలిసి నయన తార పై కంప్లైంట్ చేసారు. ఆమె చిత్రం విషయంలో కోఆపరేట్ చేయకపోవటంతో చాలా నష్టపోవాల్సి వస్తుందని తెలియచేసారు. ఈ విషయమై నయన తార మీడియాతో మాట్లాడుతూ… “నేను ఈ చిత్రం కోసం ఇచ్చిన డేస్ ఇప్పటికే అయిపోయాయి. వారు వాటిని వాడుకోలేదు. ఇప్పుడు నేనే వేరే ప్రాజెక్టులలో పూర్తి బిజీగా ఉన్నాను. ఆ చిత్రం కోసం ఫ్రెష్ గా కాల్ షీట్స్ ఇచ్చే పరిస్ధితుల్లో లేను. అలా చేస్తే మిగతా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుంది ” అని ఆమె తేల్చి చెప్పారు. ఇంకా ఓ పాట, కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయట. నయన తార కనీసం తన మాజీ లవరనే విషయాన్ని కూడా తన కెరీర్ కు సంబంధించినంత వరకు పరిగణించడం లేదంటే.. శింబు తో బ్రేక్ అప్ విషయం లో నయన్ ఎంత భాద పడిందో అర్థమౌతోంది అంటున్నారు ఆమె అభిమానులు.