Home / Entertainment / నాని ‘నేను లోకల్’ ఫస్ట్ లుక్ విడుదల.

నాని ‘నేను లోకల్’ ఫస్ట్ లుక్ విడుదల.

Author:

ఇప్పుడున్న హీరోలలో వరుస విజయాలు సాధిస్తున్న హీరో నాచ్యురల్ స్టార్ నాని ఒకడు. తన తాజా చిత్రం “నేను లోకల్” షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కొద్దిగా క్లాస్ సినిమాలు చేసిన నాని మళ్ళీ మాస్ తో మరోసారి అలరించనున్నాడు. నేను లోకల్ సినిమా ఫస్ట్ లుక్ నాని తన ట్విటర్ ద్వారా విడుదల చేశాడు. చిత్రంలో హీరో పాత్ర పేరు బాబు. మనోడికి చదువు నిల్… యాటిట్యూడ్ ఫుల్. ఇదే ఈ సినిమాకు ట్యాగ్ లైన్ కూడా “యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీతింగ్” అంటూ తన మాస్ నటనతో అందరిని అలరించనున్నాడు.

nenu-local-first-look-poster

నాని తన ట్విట్టర్ ద్వారా ‘నేను లోకల్’ సినిమాలోని తన పాత్రను పరిచయం చేస్తూ…. పేరు – బాబు, క్వాలిఫికేషన్ – నిల్, యాటిట్యూడ్ -ఫుల్. అలాగే ‘నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ సినిమాను ‘సినిమా చూపిస్తమామ’ అంటూ అందరిని అలరించిన దర్శకుడు త్రినాథ నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు ప్రేమ కథ అయిన, మాస్ సినిమా అయిన కామెడీని జోడించి ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాడు. మరి మొదటి సారి నాని, త్రినాద్ కలయికలో వస్తున్నా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం.

(Visited 141 times, 1 visits today)