Home / Reviews / నేను లోకల్ రివ్యూ & రేటింగ్.

నేను లోకల్ రివ్యూ & రేటింగ్.

Alajadi Rating

3/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: నాని, కీర్తీ సురేష్, నవీన్ చంద్ర, సచిన్ ఖేదెకర్, పోసాని, రఘు బాబు, తదితరులు

Directed by: త్రినాధ రావు నక్కిన

Produced by: దిల్ రాజు

Banner: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Music Composed by: దేవీ శ్రీ ప్రసాద్

ఈ రోజుల్లో సంవత్సరానికి నాలుగు సినిమాలు చేయడమంటే మామూలు మాటలు కాదు కాని ఆ పని చేసి చూపించాడు నాచురల్ స్టార్ నాని. అందులో ఇప్పటికే విడుదల అయిన మూడు చిత్రాలు ప్రేక్షకుల మన్ననలు పొంది సూపర్ హిట్లుగా నిలిచి పోయిన సంవత్సరాన్ని నానికి గుర్తుండిపోయేలా చేసాయి. ఇక ఈ కొత్త సంవత్సరం నాని, కీర్తీ సురేష్ జంటగా నటించిన “నేను లోకల్” సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ” సినిమా చూపిస్తా మామ” సినిమా దర్శకుడు త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేయండి.

కథ:

డిగ్రీ పాస్ అవ్వడానికి నానా కష్టాలు పడి, పాసైన తరువాత నెక్స్ట్ ఏంటి..? అని ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా కీర్తి (కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు బాబు (నాని), కీర్తి తనని ప్రేమించేలా చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటాడు, బాబు ప్రేమకి ఒక పోలీస్ ఆఫీసర్, కీర్తి తండ్రి (సచిన్ ఖేద్కర్) అడ్డుపడతారు, బాబు ప్రేమని కీర్తి అంగీకరించిందా..? పోలీస్ ఆఫీసర్ ని ఎలా ఎదుర్కున్నాడు..? అనేది మిగతా సినిమా.

అలజడి విశ్లేషణ:

నాని స్క్రీన్ మీద ఉంటే చాలు తన యాక్టింగ్ టాలెంట్ తో సినిమా మొత్తాన్ని నడిపించేస్తాడు అనేది ఈ సినిమాతో మళ్ళీ నిరూపించాడు, ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయి వెనుకాల తిరగడం, అమ్మాయి తండ్రి ఆ ప్రేమని అడ్డు పడటం, హీరో ఏదో ఒకటి చేసి హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం, ఇది ఎన్నో సినిమాల నుండి మనం చూస్తున్న కథ, ఈ సినిమా కథ కూడా ఇంచుమించు అదే, కానీ హీరో స్థానంలో ఉన్న నాని వల్ల మనకి సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు, ప్రతి సీన్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది.

మన న్యాచురల్ స్టార్ నానికి పోటీగా కీర్తి సురేష్ ఇంకా బాగా నటించింది, కళ్ళ తోనే హీరో, హీరోయిన్లు ఇద్దరు సినిమాని నడిపించేసారు, ఫస్ట్ ఆఫ్ లో మొత్తం ఎంటెర్టైన్మ్నెట్ తో నిండిపోయింది, నాని కామెడీ టైమింగ్ తో , డైలాగ్స్ తో అదరగొట్టాడు. హీరో నవీన్ కృష్ణ కూడా మంచి రోల్ చేసాడు

దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయిపోయింది, ఈ సినిమాలో నానిలో ఉన్న డాన్సర్ ని కూడా మనం చూడవచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి,కథ పాతదే అయిన సూపర్బ్ స్క్రీన్ ప్లే తో మంచి ఎంటెర్టైనమెంట్ సినిమాగా, ఎక్కడ బోర్ కొట్టకుండా తెరకెక్కించారు . నేను లోకల్ పక్క పైసా వసూల్ సినిమా.

నటీనటుల పనితీరు:

నాని: నాచురల్ స్టార్ నాని, తన పేరుకు తగ్గట్లే తనకిచ్చిన బాబు పాత్రలో ఒదిగిపోయాడు. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ లో ఎటువంటి తప్పులు లేకుండా తన పాత్రలో జీవించాడు.

కీర్తీ సురేష్: కీర్తి సురేష్ నాని కి పోటాపోటీగా యాక్టింగ్ చేసింది, తనకి డైలాగ్స్ అవసరం లేదు, ఎక్స్ ప్రెషన్స్ ఉంటే చాలు అన్నంతలా మరిపించింది.

నవీన్ కృష్ణ: ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసాడు, ఒక సీరియస్ పాత్రలో బాగా నటించాడు.

ఇంకా సచిన్ ఖేద్కర్, పోసాని మిగిలిన వాళ్ళు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్:

  • నాని నటన
  • దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం
  • కామెడీ, పంచ్ డైలాగ్స్
  • స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:

  • స్టోరీ
  • స్లో సెకండ్ హాఫ్

పంచ్ లైన్: నాని లోకల్ కాదు పక్కా లోకల్  

(Visited 5,516 times, 1 visits today)