Home / Entertainment / 21న నేను శైలజ ఆడియో రిలీజ్.

21న నేను శైలజ ఆడియో రిలీజ్.

Author:

ram pothineni

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నేను..శైలజ… కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమకథకు కుటుంబ భావోద్వేగాల్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మించారు. కిషోర్ కథ రామ్‌కు కొత్త తరహా సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.

రామ్ ఇప్పటివరకూ ఈ తరహా పాత్రను చేయలేదు అంటున్నారు. చాలా రియలిస్టిక్ గా ఉంటునే, లవ్లీగా కూడా ఉంటుందని.. ఇది ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ. ముందు ఈ చిత్రానికి ‘హరికథ’ అనుకున్నప్పటికీ, ఆ తర్వాత ‘నేను… శైలజ’ బాగుంటుందని అదే ఫైనలైజ్ చేశారు. హీరో పాత్ర సాఫ్ట్ గా ఉంటూనే మాస్ కి కనెక్ట్ అవుతుందత. కిశోర్ తిరుమల రామ్‌ పాత్రను అద్భతుంగా మలిచారు. సన్నివేశాలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు అద్భుతంగా వచ్చయని. చిత్రీకరణ కూడా కనువిందుగా జరిగిందని. అనుకున్న విధంగా చిత్రాన్ని 55 రోజుల్లో పూర్తి చేయగలిగాం” అని చెప్పారు. ఈ నెల 21న పాటలను, జనవరి 1న లేదా 7న చిత్రాన్ని విడుదల చేయనున్నారు అని తెలిపారు.

(Visited 77 times, 1 visits today)