Home / Entertainment / స్నేహం సముద్రం లాంటిది, మరి లవ్వూ హుదూద్ తుఫాన్ లాంటింది.

స్నేహం సముద్రం లాంటిది, మరి లవ్వూ హుదూద్ తుఫాన్ లాంటింది.

Author:

Nenu Sailaja Movie Trailer

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘నేను శైలజ’ పేరుతో ఓ క్యూట్ లవ్‌స్టోరీ విడుదలకు సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే.రామ్ తన కెరీర్లో చాలా కాలం తర్వాత రొటీన్‌కు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని తేలిపోయింది. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాకు ముందు నుంచే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చిపెట్టాయి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1న కొత్త సంవత్సర కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ఓ సరికొత్త ప్రేమకథతో ఓ కొత్త ప్రయత్నంగా ప్రచారం పొందుతోంది.

ఆడియో, ట్రైలర్ విడుదలై ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ సినిమాకు మంచి అంచనాలను తెచ్చిపెట్టాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇనస్టంట్‌గా కిక్కిచ్చేలా ఉంటే, ట్రైలర్ సరికొత్త అంశాన్ని, ప్రేమలో కొత్త కోణాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా రచయితగా కిషోర్ తిరుమల ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేశారు. “స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళముందు స్పష్టంగా కనపడుతుంది, కావాల్సినంత గట్టిగా వినపడుతుంది… మరి లవ్వూ.. హుదూద్ బావా.. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడుచేసేళ్ళిపోతుంది” అన్న డైలాగ్‌తో స్టార్ట్ చేస్తూ, “లవ్‌లో ఫెయిలైతే గడ్డం పెంచక, జిమ్‌కెళ్ళి సిక్స్‌ప్యాక్ చేయమంటావా” అన్న డైలాగ్‌తో ముగించి ట్రైలర్‌ను చాలా బాగా డిజైన్ చేశారు.

అడియో చివరలో చివర్లో ఝాన్సీ అన్న మాట ఓ మాత్రం సెన్సేషన్ అయిపోయింది. “యాక్చువల్లీ ఐ యామ్ ఫాలింగ్ ఫర్ యూ రామ్” అనేసింది ఝాన్సీ. ప్రోగ్రామ్ అంతా అయిపోయాక.. ఝాన్సీకి దగ్గరగా వచ్చి భుజంపై చెయ్యి వేసి మరీ “ఎంతో ఉత్సాహంగా ప్రోగ్రాం నిర్వహించారు.. ఝాన్సీగారికి థాంక్యు” అన్నప్పుడు ఈ యాంకర్ స్పందన ఇది. అఫ్ కోర్స్.. అనేశాక.. ఎంతబాగా యాక్ట్ చేశారో యాక్టర్ గా అంటూ కవర్ చేసేసి.. క్లోజ్ చేసేసింది.

(Visited 72 times, 1 visits today)