Home / Reviews / నేను శైలజ సినిమా రివ్యూ & రేటింగ్.

నేను శైలజ సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

nenu sailaja movie perfect review and rating

రొటీన్ కమర్షియల్ సినిమాలకు బ్రేక్ ఇస్తూ ఫ్రెష్ నెస్ కోసం యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నేను శైలజ’. మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమాలో సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ మరియు సాంగ్స్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

హరి (రామ్), శైలజ (కీర్తి సురేష్) బాల్య స్నేహితులు. వాళ్ల తల్లితండ్రులు ప్రక్క ప్రక్కనే ఉండటంతో ఒకరితో ఒకరు చనువుగా ఉంటారు.. సత్య రాజ్ (శైలజ తండ్రి ) బిజినెస్ పని మీద వేరే టౌన్ కు వెళ్ళతాడు..అదే టైం లో హరి వాళ్ళ తండ్రి నరేష్ కి వైజాగ్ కు ట్రాన్స్ ఫర్ కావడం వల్ల ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్ళిపోతారు..దీంతో శైలజ కు చెప్పలేకపోయిన ప్రేమను ఇంకా ఎవరికీ మిస్ అవ్వకోడదని కనపడిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ..వాళ్లు రిజెక్టు చేస్తూంటారు. దాంతో స్కూల్ అమ్మాయిలందరూ కలిసి తమకు ఇచ్చిన ప్రేమ లేఖలను తీసుకెళ్ళి క్లాసు టీచర్ కి ఇవ్వడం తో , ఈసారి అమ్మాయిలకు ఇవ్వడం బదులు టీచర్ కే ఇస్తే బాగుంటుందని ఆ లెటర్ ని తీసుకెళ్ళి టీచర్ కి ఇవ్వడం తో ఆమె వెంటనే హరి తల్లితండ్రులును పిలిచి మద్దలిస్తుంది..ఆ టైం తల్లి చెప్పిన మాటలు హరి మైండ్ లో పెట్టుకుంటాడు..కట్ చేస్తే….

హరి ఓ నైట్ క్లబ్ లో డిజేగా పనిచేస్తుంటాడు. చిన్నతనం నుంచి కనిపించిన అమ్మాయి కల్లా ప్రపోజ్ చేయడం ఆ అమ్మాయి నో అంటే ఇంకో అమ్మాయిని చూడడం. అలా తను ప్రేమ అనుకొని ప్రపోజ్ చేసిన అందరూ మనం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి వెళ్లిపోతుంటారు. దాంతో ఇక నా లైఫ్ లో ప్రేమకి ప్లేస్ లేదు అనుకుంటాడు. అలాంటి టైంలో మన హీరో హరికి శైలజ (కీర్తి సురేష్) కనపడుతుంది. గత అనుభవాల వల్ల ఒకటి రెండు సార్లు నో అనుకున్నా అనుకోకుండా తనతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అదే విషయాన్ని కీర్తికి చెబితే హరి ఐ లవ్ యు బట్ ఐ యాం నాట్ ఇన్ లవ్ విత్ యు అని చెప్పి వెళ్ళిపోతుంది.

ఆ బాధలో హరి గడ్డం పెంచుకొని దేవదాసులా మారతాడు. కానీ ఆ టైంలో కీర్తి ఎందుకు తన ప్రేమకి నో చెప్పింది అనే విషయం హరికి తెలుస్తుంది. అది తెలుసుకున్న హరి మళ్ళీ శైలజ లైఫ్ లోకి ఎలా వెళ్ళాడు? హరి ఎలా శైలజకి ఉన్న సమస్యను పరిష్కరించాడు? ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో హారి ఎవరెవరికి దగ్గరయ్యాడు? ఫైనల్ గా హరి కీర్తి ప్రేమని పొందగలిగాడా లేదా అన్నదే సినిమా కథ..

అలజడి విశ్లేషణ:

 ఈ సినిమా పరంగా బిగ్గెస్ట్ హెల్ప్ అయిన వారు ఇద్దరు వాళ్ళే లీడ్ పెయిర్ అయిన రామ్ – కీర్తి సురేష్. రామ్ ని చాలా కాలంగా ఒకే మూస పాత్రల్లో చూస్తున్నాం.. కానీ ఇందులో వాటన్నిటికీ పూర్తి డిఫరెంట్ గా అనిపించే రామ్ ని చూస్తాం. రామ్ లోని అసలైన నటున్ని ఈ సినిమాలోనే చూస్తాం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన పాత్ర ఎంత నాచురల్ గా ఉంటుందో అంతే నాచురల్ గా రామ్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. రామ్ హావ భావాలు, డైలాగ్ డెలివరీ, మానరిజమ్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇక కీర్తి సురేష్ ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ లో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. హీరోయిన్ అనే ఫీలింగ్ ని తీసుకు రాకుండా మన పక్కింటి అమ్మాయిలా కానిపిస్తుంది. కానీ ఈ సినిమాలో తనకి ఇచ్చిన సీరియస్ పాత్రకి న్యాయం చేసింది. హరి కథ మొదలు అయినప్పటి నుంచీ మన లైఫ్ లో, మన ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న సంఘటనల్లా అనిపించే సన్నివేశాలతో సినిమాని మొదలు పెట్టడం అలానే సినిమాని కంటిన్యూ చేయడం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. రామ్ లైఫ్ లో జరిగే అనుభవాలను ప్రేక్షకులు బాగా నవ్వుకునేలా తీసారు. ఇకపోతే రామ్ – కీర్తి సురేష్ ల లవ్ ట్రాక్ ని చాలా లైవ్లీగా, ఫీల్ గుడ్ అనిపించేలా చేయడం ఫస్ట్ హాఫ్ కి ప్రాణం అని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఫీల్ గుడ్ ఫస్ట్ హాఫ్ సినిమాని నిలబెట్టేసింది. ఓవరాల్ గా రామ్ – కీర్తి సురేష్ ల కెమిస్ట్రీ బాగుంది. ఇక ముఖ్యమైన పాత్రలో సత్యరాజ్ మరోమారు మెప్పించాడు. సత్యరాజ్ – కీర్తి సురేష్ – రామ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ప్రదీప్ రావత్ ఈ సినిమాలో మొదటిసారి కామేడీ టచ్ ఉన్న పాత్ర చేసి అక్కడక్కడా ప్రేక్షకులను మెప్పించాడు.‘నేను శైలజ’ అనే సినిమాకి ఆల్ టైం బెస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది అంటే అది రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనే చెప్పాలి. కథలోని ఫీల్ ని పాటల్లో, నేపధ్య సంగీతంలో దేవీశ్రీ చాలా బాగా చూపించాడు. ఇక సినిమాలోకి వస్తే ఫస్ట్ హాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

సినిమా మొత్తంగా డీల్ చేసింది మెయిన్ పాయింట్ తండ్రి – కుమార్తెలు మధ్య ఎమోషన్ అండ్ లవ్. కానీ తండ్రి – కుమార్తెల మధ్య అసలు దూరం ఎందుకు మొదలైంది, ఆ దూరం అలా 25 ఏళ్ళు కొనసాగడానికి గల కారణాన్ని చూపించలేదు. లాగే ఓవరాల్ చూసుకుంటే చాలా పాతదే అనిపిస్తుంది. ఇకపోతే సినిమాలో ఒక్క హీరో పాత్రని తప్ప మిగతా అన్ని పాత్రలని ఎందుకు అంత సీరియస్ గా, సరైన క్లారిటీ కనిపించలేదు. అలాగే హీరోయిన్ పాత్రని ఇంకాస్త బెటర్ గా ఉంటే సినిమాలో భాగుండేది.

బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ సెకండాఫ్… సెకండాఫ్ లో అక్కడక్కడా కామెడీ ఉన్నా, ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ బాగున్నా మిగతా అంతా బాగా ఊహాజనితంగా సాగడమే కాకుండా బాగా బోరింగ్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ సెకండాఫ్ ని అంత బాగా రాసుకోలేదనిపిస్తుంది. ఎక్కువగా ఎమోషనల్ సైడ్ వెళ్ళిపోవడం వలన సినిమా బాగా స్లోగా అనిపిస్తుంది. అలాగే కథనం మరింత ఊహాజనితంగా సాగడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్.సీనియర్ ప్రిన్స్, శ్రీముఖి, నరేష్, ప్రగతి, కృష్ణ భగవాన్, జబర్దస్త్ సుధీర్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించడమే కాకుండా అడపాదడపా నవ్వించారు. ఇక సినిమాలో చెప్పుకోదగిన విషయాలు అంటే సెకండాఫ్ లో అక్కడక్కడా సందర్భానుసారంగా వచ్చే కామెడీ బాగా పేలింది. అలాగే సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేషాలు బాగా ఎమోషనల్ గా ఉన్నాయి.

నటీనటుల పని తీరు:

రామ్: రామ్ లోని అసలైన నటున్ని ఈ సినిమాలోనే చూస్తాం. తన పాత్ర ఎంత నాచురల్ గా ఉంటుందో అంతే నాచురల్ గా రామ్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. రామ్ హావ భావాలు, డైలాగ్ డెలివరీ, మానరిజమ్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి.

కీర్తి సురేష్: లవ్ ట్రాక్ లో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. హీరోయిన్ అనే ఫీలింగ్ ని తీసుకు రాకుండా మన పక్కింటి అమ్మాయిలా కానిపిస్తుంది.తనకు ఇచ్చిన పాత్రకి న్యాయం చేసింది.

సత్యరాజ్: తనకు ఇచ్చిన ముఖ్యమైన పాత్రలో సత్యరాజ్ మరోమారు మెప్పించాడు.తన నటనతో అందరిని తనవైపు తిప్పుకుంటాడు ఈ సినిమాలో
సీనియర్ ప్రిన్స్, శ్రీముఖి, నరేష్, ప్రగతి, కృష్ణ భగవాన్, జబర్దస్త్ సుధీర్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించడమే కాకుండా అడపాదడపా నవ్వించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమా కి బాగా హెల్ప్ అయ్యింది అంటే దేవి శ్రీ మ్యూజిక్ …రామ్ కు ఎలాంటి మ్యూజిక్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అలాంటి అద్భుతమైన మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు..సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది..సినిమా అంత ఫ్రెష్ లుక్ లో కనిపించింది..ముఖ్యంగా సాంగ్స్ లో తన పనితనం చూపించి మరోసారి సక్సెస్ అయ్యాడు…

కిషోర్ డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి..ముఖ్యంగా రామ్ చెప్పిన..”స్నేహం అనేది సముద్రం లాంటిదని . ప్రేమ అనేది హుదుద్ లాంటిదని” , “ఆడపిల్లని పెళ్లి అయ్యాక అత్తారింటికి పంపించే కాన్సెప్ట్ ఎవరయితే కనిపెట్టాడో వాడికి కూతురు ఉండదు..” , “ఒక్కతే వచ్చింది..సైన్యం లేదు..యుద్ధం జరగలేదు..కనీసం ఆయుధం లేదు సామి…నా సంతోషం అంత దోచుకపోయింది..” ఇవే కాదు సినిమాలో చాల హార్ట్ కు టచ్ అయ్యే డైలాగ్స్ రాసాడు..

ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది..శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఒకే అనిపించినా , సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కాస్త బోర్ కొట్టేలా చేసాడు..దర్శకత్వం శాఖకు వస్తే కిషోర్ తిరుమల రాసుకున్న కథ లో కొత్తదనం లేకపోయినా, ఎమోషన్స్ ని కొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు..ఫస్ట్ హాఫ్ అంత ఇంటర్స్ట్ గా రాసుకున్న సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ఆకట్టుకోలేక పోయాడు.. క్లైమాక్స్ ని కూడా బాగా సాగాదిసాడు.

ప్లస్ పాయింట్స్:

  • మ్యూజిక్
  • డైలాగ్స్
  • రామ్ పెర్ఫార్మన్స్
  • సెంటిమెంట్ సీన్స్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్
  • స్క్రీన్ ప్లే
  • కామెడీ
  • రొటీన్ స్టొరీ లైన్

అలజడి రేటింగ్: 3.25/5

                     పంచ్ లైన్:  రామ్ లవ్ లో ఫీల్ ఉంది & నేను శైలజలో మ్యాటర్ ఉంది.

(Visited 908 times, 1 visits today)