Home / Entertainment / జనవరి 1న ‘నేను… శైలజ’ వచ్చేస్తున్నం.

జనవరి 1న ‘నేను… శైలజ’ వచ్చేస్తున్నం.

Author:

Nenu Sailaja Movie Release Date

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ ‘నేను… శైలజ’ చిత్రాన్ని నిర్మించారు. రామ్, సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది.

పోస్టర్స్, ట్రైలర్, ఆడియో పరంగా ఆల్రెడీ ‘నేను… శైలజ’ అందరికీ దగ్గరైంది. గ్యారంటీ హిట్ అనే పాజిటివ్ వైబ్ నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యుల అభినందనలు కూడా లభించాయి. ‘మంచి అనుభూతికి గురి చేసింది’ అని సెన్సార్ బోర్డ్ సభ్యులు అభినందించారు. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ చిత్రం అని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. జనవరి 1న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ చిత్రవిశేషాలను ‘స్రవంతి’ రవికిశోర్ తెలియజేస్తూ – ”ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న మంచి లవ్ స్టోరీ ఇది. ఇందులో రామ్ డీజేగా నటించాడు. తన పాత్రతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఈ మధ్యకాలంలో రామ్ చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రం ఇది. రామ్ పాత్ర సాఫ్ట్ గా ఉంటూనే మాస్ కి కనెక్ట్ అవుతుంది. సత్యరాజ్ చేసిన తండ్రి పాత్ర అందరికీ నచ్చుతుంది. కిశోర్ తిరుమల చాలా క్లారిటీగా తెరకెక్కించాడు. సన్నివేశాలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలకు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ట్రైలర్ కి కూడా మంచి ఆదరణ లభించింది. 2016 మొదటి రోజున విడుదల కానున్న స్ర్టయిట్ మూవీ ‘నేను… శైలజ’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు.

(Visited 86 times, 1 visits today)