Home / Entertainment / సక్సెస్ టూర్ లో ఫ్యాన్స్ తో రామ్ సక్సెస్ సెలబ్రేషన్స్

సక్సెస్ టూర్ లో ఫ్యాన్స్ తో రామ్ సక్సెస్ సెలబ్రేషన్స్

Author:

nenu sailaja success tour details

యంగ్ హీరో రామ్ కు తన తాజా సినిమా ‘నేను శైలజ’ సక్సెస్ ను అందించింది. ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరిచయం అవటంతో పాటు తొలి చిత్రంతోనే ఆకట్టుకోవడం విశేషం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, స్రవంతి రవికిషోర్ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. దీంతో చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ సక్సెస్ ను అభిమానులతో సెలబ్రేట్ చేసుకోవడానికి రామ్ రెడీ అవుతున్నాడు. అది కూడా తన చిత్ర బృందంతో కలిసి రామ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల సక్సెస్ టూర్ ను ప్లాన్ చేయడం విశేషం. ఈ మేరకు చిత్ర బృందం 7న విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్ వద్ద అభిమానులను అలరించి, అదే విధంగా చిత్ర బృందం 8న తేదీన అనకాపల్లి మరియు కాకినాడలో సినిమా సక్సెస్ ను అభిమానులతో పంచుకుని అక్కడి నుంచి 9వ తేదీన విజయవాడ మరియు గుంటూరుకు రానున్నారు. చివరగా, 10వ తేదీన విజయవాడలో సినిమా సక్సెస్ టూర్ ను చిత్ర బృందం ముగించనుంది.

(Visited 100 times, 1 visits today)