Home / Entertainment / ‘నేను శైలజ’ వచ్చేస్తున్నాం- రామ్

‘నేను శైలజ’ వచ్చేస్తున్నాం- రామ్

Author:

Nenu Shalija Movie First Look

ఎందుకంటే ప్రేమంటే, ఒంగోలు గిత్త, మసాలా, పండగ చేస్కో, ‘శివమ్’ సినిమాలు నిరాశ పరిచిన తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీకి ‘నేను శైలజ’. ఈ మూవీలో రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ తో రానున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుగుతున్నాయి. నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి ఫీల్ గుడ్ స్టొరీలా ఉందనే ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది.

తాజాగా రామ్ తన ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేశాడు. ‘ నేను శైలజ అనే సినిమా చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ. నేను చేసిన మరియు ఇప్పుడు వస్తున్న కమర్షియల్ సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో ఎలాంటి మసాలాఆశించవచ్చు , ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని’ రామ్ తెలిపాడు. దీని ద్వారా ప్రేక్షకులకి నేను శైలజ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని రామ్ తెలియజెయాలనుకున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఆడియో కోసం డిసెంబర్ 12వ తేదీని ఫిక్స్ చేయగా, రిలీజ్ కోసం మేము ముందుగా చెప్పినట్టుగానే 2016 జనవరి 1ని ఫిక్స్ చేసారు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి స్రవంతి రవికిషోర్ నిర్మాత.

(Visited 110 times, 1 visits today)