Home / Inspiring Stories / కుకుర్ తీహార్ అనే కుక్కల పండగ గురించి తెలుసా..?

కుకుర్ తీహార్ అనే కుక్కల పండగ గురించి తెలుసా..?

Author:

తనకు తోడుగా నిలిచిన జంతువులనూ,భూమినీ,ఆఖరికు ఆయిధాలనూ,పనిముట్లనూ పూజించటం మన సంస్కృతిలో ఒక భాగం. సంక్రాంతి మూడవరోజైన కనుమనాడు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం సంవత్సరమంతా తన కోసం కష్టపడ్డ ఎద్దులనూ,పాడిని అభివృద్ది చేసే ఆవులనూ పూజించటం మనకు తెలిసిందే. అయితే కుక్కను పూజించటం ఎప్పుడైనా విన్నారా.? భైరవుడనే పేరుతో ఎప్పుడో తప్ప శునకాలకు పూజలు జరగవు అదీ భైరవ రూపంలో ఉన్న శునక విగ్రహానికి తప్ప మన ఇల్లలో ఉండే కుక్కలకు గానీ,వీధిలో ఉండే కుక్కలకు గానీ పూజ చేయటం మనకు కొత్తే కాదు వింత కూడా…! కానీ తమకు నేస్తాలుగా,తమకు రక్షణనిచ్చే నేస్తాలుగా ఉన్న కుక్కలను నేపాల్ లో పూజిస్తారు. సంవత్సరం లో ఒకరోజు వాటికి పూలమాలలు వేసీ బొట్లు పెట్టీ భక్తిగా దణ్ణం పెట్టుకుంటారు….

kukur Festival 2

Every Dog has a Day అన్నది ఇంగ్లీషు సామెత. నిజంగా ఆ రోజు వచ్చేసిందేమో అనిపిస్తుంది. ప్రతీదానికి ఓ రోజు వున్నట్లుగా… కుక్కల కోసం ఒక రోజును డెడికేట్ చేసింది ఓ దేశం. అంతే కాదు. ఆ రోజు తమ పెంపుడు కుక్కలకు పూజలు కూడా చేస్తారు. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Kukur Festival

ఏటా నేపాల్ లో జరిగే.. తిహర్ పండగ రోజు అక్కడి ప్రజలు తమ పెంపుడు కుక్కలను పూజిస్తారు.కేవలం ఇంట్లో కుక్కలకే కాదు తమ వీధుల్లో తిరుగుతూ,కొత్తవారి కదలికలను పసిగట్టిచెప్పే వీధి కుక్కలకు కూడా… నేపాలీలకు తీహార్ ముఖ్యమైన పండుగ. మన దేశంలో దీపావళికి దగ్గరగా ఉండే ఈ పండుగను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు నేపాలీలు.దానికి ముందే ఇప్పుడు అన్ని కుక్కలనూ గౌరవంగా సంబోదిస్తారు ,వాటిని పండగ రోజుకోసం సిద్దం చేసే పాటలను పాడతారు. పల్లెల్లో ఈ నెలనుంచీ ప్రతీ 40 రోజులకూకసారి. వాటికి మంచి భోజనం పెడుతూ మనుషులతో సమానంగా గౌరవించే ఉత్సవాల రోజులు మొదలు పెడతారు. ఈ ఉత్సవాల్లో రెండో రోజును కుక్కల కోసం కేటాయించారు. దీన్నే ‘కుకుర్ తిహర్’ అంటారు. మనుషులతో విశ్వాసంగా వుండే కుక్కలను ఈ రోజున పూజిస్తారు నేపాలీలు. కుక్కను యముడి దూతగా భావిస్తారు నేపాలీలు. అందుకే కుక్కను గౌరవించాలంటారు వాళ్లు. అంతే కాదు.. పశువులను పూజించడం తిహర్ ఉత్సవాల ప్రత్యేకత. పండుగ నాలుగు రోజుల్లో రోజూ ఒక జంతువును పూజిస్తారు.

Kukur Festival 3

కుకుర్ రోజు తమ పెంపుడు కుక్కు నుదుటన తిలకం దిద్ది, దాని మెడలో పూల మాల వేసి.. సత్కరిస్తారు. మనుషులతో ఇంత విశ్వాసంగా వున్నందుకు కుక్కలకు ధన్యవాదాలు చెబుతూ పూజిస్తారు.

(Visited 334 times, 1 visits today)