Home / Entertainment / మెగా క్యాంపు నుండి మరో హీరో ఎంట్రీ?

మెగా క్యాంపు నుండి మరో హీరో ఎంట్రీ?

Author:

Vaishnav

ఏ క్షణాన చిరంజీవి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మెగా స్టార్ అయ్యాడో కానీ ఇప్పుడు చిరు పేరు చెప్పుకొని వరసపెట్టి మెగా హీరోలు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, చరణ్, శిరిష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వరకు చిరు పేరు చెప్పుకొని వచ్చిన వల్లే..ఇందులో అల్లు శిరీష్ కు తప్ప మిగతా మెగా హీరోలందరికీ జనాలు నీరాజనాలు పట్టారు..ఇది చాలదనంటు మరో మెగా హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని మెగా క్యాంపు నుండి సమాచారం బయటకు వస్తుంది.

tej

తాజాగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా సినిమాల్లోకి త్వరలోనే రంగప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చదువుకుంటున్న ఈ అబ్బాయికి సినిమాలంటే విపరీతమైన పిచ్చి అని, తను కూడా చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రంలో కూడా ఒక పేషెంట్ గా కూడా నటించడం జరిగిందట. చదువుతో పాటు మరోపక్క సినిమాకి సంబంధించిన డాన్సులు, ఫైట్స్ కూడా నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇంకేముంది త్వరలోనే మంచి రోజు చూసుకొని ఈ బాబు కూడా మెగా ఫ్యామిలీ నుండి 9 వ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

(Visited 474 times, 1 visits today)