Home / Inspiring Stories / పట్టాలెక్కనున్న మేక్ ఇన్ ఇండియా రైలు

పట్టాలెక్కనున్న మేక్ ఇన్ ఇండియా రైలు

Author:

NewTrains

భారతీయ రైలు రూపు మార్చుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏసీ కోచ్ లూ, ఫారిన్ రైళ్లలో  లాగా ఆత్యాదునికమైన సీట్లు, బయో టాయిలెట్స్, సేపరేట్ చార్జింగ్ పాయింట్ ఇంకా మరిన్ని వసతులతో మనం ప్రయానించేది ఫ్లైట్లోనా రైలు లోన అనిపించే విధంగా రైల్ కోచ్ లు సిద్దమౌతున్నాయి. ఐతే ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఈ కోచ్ లు అన్నీ మేక్ ఇన్ ఇండియా లో భాగం గా పూర్తి స్థాయి భారతీయ పరిఙ్ఞానంతో నిర్మించబడుతున్నాయి. దీనిని 25 సెప్టెంబర్ 2014 న ప్రధాన మంత్రి, నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఈ చొరవ ప్రధానంగా దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారులకు 125 కోట్ల జనాభాతో బలమైన భారతదేశం – ఒక తయారీ కేంద్రంగా నిర్మించడానికి మరియు ఉద్యోగావకాశాలు సృష్టించడానికి హామీ పూర్వక అనుకూలమైన వాతావరణం కల్పిస్తుంది.ఈ చొరవ వెనుక ప్రధాన లక్ష్యం నూతన ఉద్యోగ సృష్టి మరియు నైపుణ్యం అభివృద్ధికి తోడ్పడటం, ఆర్ధిక వ్యవస్థలోని 25 రంగాల మీద ఇది దృష్టి సారిస్తుంది.

Train3
ఇదే నినాదం పై రైల్వే కోచ్ లను పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ లోనే నిర్మిస్తున్నారు.ఇలా తయారు చేసిన 24 కోచ్ లతో కూడిన ఒక ప్యాసింజర్ రైలుతో బోపాల్ నుంచీ బినా వరకూ 120 కి.మీ. వేగం తో ఒక ప్రయోగాత్మకంగా నడిపిచూసారు కూడా. ఈ అదునాతన కోచ్ లన్నీ భొపాల్ లోని కోచ్ రిహాబిలిటేషన్ వర్స్ షాప్ లోనే నిర్మించబడుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న ప్రణాలిక ప్రకారం మొత్తం నిర్మించినకోచ్ లు 111 కాగా వీటిలో 87 నాన్ ఏసీ,17 ఏసీ 3టైర్ లోనూ,మిగతా 5 ఏసీ 2టైర్,1ఏసీ చైకార్ గానూ ఉంటాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.మొదటగా ఈ తరహా కోచ్ లను రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఉపయోగిస్తారని సమాచారం.

Train4 train2

(Visited 276 times, 1 visits today)