Home / Inspiring Stories / వయసు 60 అయినా యంగే .. మళ్ళీ జాబుకి రెడీ.

వయసు 60 అయినా యంగే .. మళ్ళీ జాబుకి రెడీ.

Author:

60 ఏళ్ళు రాగానే రిటైర్మెంట్…ఉద్యోగస్తులందరూ చేస్తున్న ఉద్యోగానికి టాటా చెప్పేసి ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కాని ఇదంతా పాత కథ ఇవాళ్రేపు 60 దాటినా చాలా మంది ఫిజికల్ గా, మెంటల్ గా చాలా ఫిట్ గా ఉంటున్నారు . అందుకే 60 సంవత్సరాలు దాటినా ఇంకా ఉద్యోగానికి రెడీ అంటున్నారు. కాని ఈ యంగ్ మైండెడ్ తాతయ్యలకు అవకాశాలేవీ ? ఇలా అలోచించే హైదరాబాద్ కి చెందిన ప్రతాప్ కుంద అనే యువకుడు నాట్ రిటైర్డ్ డాట్ ఇన్ అనే స్టార్టప్ కంపనీ ని మొదలెట్టాడు.

హైదరాబాద్ కేంద్రంగా మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి మంచి అవకాశాలే అందిస్తోంది. ఎందుకంటే రిటైర్ అయినా వాళ్లలో చాలా మందికి పెన్షన్స్ ఉండవు. చిన్న చిన్న డబ్బు అవసరాలకోసం కుటుంబం మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక చాలా మంది సీనియర్ సిటిజెన్స్ మరల ఉద్యోగానికి రెడీ అంటున్నారు.

new jobs for retired people

వీరికున్న అనుభవం కూడా కొత్త కంపెనీలకు అడ్వాంటేజ్ అవుతుండడంతో వీరికి ఉద్యోగాలిచ్చేందుకు కూడా చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి.. కొంతమంది ఆరోగ్యంగా ఉండి ఇంట్లో ఖాళీగా కూర్చోలేక కూడా ఉద్యోగాల కోసం చూస్తూన్నారు. ఒక రకంగా ఇలా ఉద్యోగాలు చేద్దాం అనుకునేవారిని, కంపెనీలను ఈ నాట్ రిటైర్డ్ డాట్ ఇన్ సంస్థ ఒక దగ్గరికి చేర్చి ఇరువురికి లాభం చేస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సైట్ లో 6వేలకు పైగా సభ్యులయ్యారంటే ఎంత మంది 60ప్లస్ బాయ్స్ జాబ్స్ కి రేడిగా ఉన్నారో చూడండి అంటున్నారు నాట్ రిటైర్డ్ డాట్ ఇన్ సంస్థ డైరెక్టర్. పార్ట్ టైం, వాలంటరీ, వర్క్ ఫ్రం హోమ్, అడ్వైజరీ , కన్సల్టెన్సీ విభాగాల్లో వీరికి ఉద్యోగాలు అందిస్తున్నట్టు నాట్ రిటైర్డ్ డాట్ ఇన్ ఫౌండర్ ప్రతాప్ చెబుతున్నారు. ఇప్పటికే 300 పై చిలుకు కంపెనీలతో జత కట్టి ఈ సంస్థను విస్తరించే ఆలోచనల్లో ఉన్నారు నిర్వాహకులు. మీరూ ట్రై చేద్దామనుకుంటే వెంటనే లాగిన్ అవ్వండి www.notretired.in

(Visited 410 times, 1 visits today)