Home / Inspiring Stories / ఆర్టీసీలో ఏయిర్ పోర్టు తరహా సేవలంటే ఇవా..!?

ఆర్టీసీలో ఏయిర్ పోర్టు తరహా సేవలంటే ఇవా..!?

Author:

APSRTC new Scheme

తరచూ ప్రయాణాలు చేసే వారికి ఒక శుభవార్త మంగళ వారం గానీ శుక్ర వారం గానీ లేదా అమావాస్య రోజు దూరప్రాంత బస్సులు కేవలం 20 మందితోనే బస్సులు నడుస్తుంటాయి. అప్పుడు ప్రయాణం ప్లాన్ చేసుకోండి. రద్దీ కి రద్దీ తక్కువా,డబ్బులూ ఆదా ఔతాయి. రద్దీ తక్కువ ఓకే మరి డబ్బులెలా మిగులుతాయి అంటార? అమావాస్య, మంగళవారాలు,  పరీక్షలు లాంటి సందర్భాలలో ఆర్టీసీ బస్సులో టికెట్ మీద 50 శాతం వరకు రాయితీ లభించే అవకాశముంది.

ఎందుకంటే..మంగళవారం, శుక్రవారం, అమావాస్య, అమావాస్య ముందు రోజు ప్రయాణికులు సరిపడాలేక ఎప్పటికప్పుడు సర్వీసులు రద్దు చేయటమో లేదా ఆ తక్కువ మందితోనే బస్సులని నడపాల్సి రావటమో జరుగుతోంది.దీంతో… రెగ్యులర్‌గా బస్టాండ్లకు వచ్చే ప్రయాణికులకూ ఇబ్బంది కలుగుతోంది. అందుకే ఎక్కువ మంది దూర ప్రయనాలకు ప్రైవేట్ ట్రావెల్స్ ని నమ్ముకుంటున్నారు.

అంటే ఇకనుండీ ప్రయాణీకులు తక్కువగా ఉండే మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజుల్లో టికెట్‌ ధర సాధారణంకంటే తక్కువగా ఉంటుందన్న మాట. అప్పుడు కనీసం ఐదు శాతం నుంచి గరిష్ఠంగా 50 శాతం వరకు ‘డిస్కౌంట్‌’ లభించవచ్చు. దీని వల్ల ప్రయాణికులను ఆకట్టుకుని, ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) పెంచుకోవచ్చునని ఆర్టీసీ భావిస్తోంది. ఇక… అదే విధంగా వారాంతాలు, పండుగలు, సెలవుల రోజుల్లో మాత్రం టికెట్‌ ధర మామూలుగానే పెరుగుతూ వుంటుంది.

ప్రైవేటు బస్సులకు పోటీగా ప్రయాణికులకు సేవలందిస్తూ, ఓఆర్‌ పెంచుకోవడంలో భాగంగానే ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఇటువంటి పద్దతులను అనుసరిస్తున్నారు. ఈ టికెట్ల ధర పెంపూ తగ్గింపుల విధానాన్ని ‘డైనమిక్‌’పద్దతి అంటారట . దీని వల్ల ప్రయాణికుల దగ్గర మళ్ళీ మంచి మార్కులు కొట్టొచ్చని ఆశిస్తున్నారు. ప్రైవేటు నుంచి ఆర్టీసీ వైపునకు రాని వారిని కూడా ఆర్టీసీ బస్ మెట్లెక్కేల్కా చేస్తారట.. ‘‘మంగళ, శుక్ర వారాలు లేదా అమావాస్య రోజు దూరప్రాంత బస్సులు కేవలం 20 మందితోనే బస్సులు నడుస్తుంటాయి. డిస్కౌంట్‌ ఆఫర్ వల్ల ఇంకో పది సీట్లు అదనంగా పొందినా లాభమే కదా! ఇలా ఏటా 70 కోట్ల వరకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది’’ అని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇక అదలా ఉంటే శని, ఆది, సోమవారాల్లో రద్దీని బట్టి టికెట్‌ ధరను 50శాతం వరకూ పెంచాలని కూడా ఆలోచిస్తున్నారు.అక్కడ తగ్గించి ఇక్కడ బాదుతారన్న మాట. అవసరాన్ని బట్టి 50శాతం వరకూ ధర పెంచుకోవచ్చని ఇటీవల ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. దీనివల్ల కనీసం ఏటా రూ.30కోట్లు అదనంగా వస్తాయని అంచనా.ఈ డైనమిక్‌ ప్రైసింగ్‌ సరిగా అమలైతే రూ.100 కోట్లు వరకూ లాభాలుండవచ్చని ఒక అంచనా.

(Visited 106 times, 1 visits today)