Home / Inspiring Stories / ఆ నంబర్స్ నుండి ఫోన్ వస్తే చాలు..! మీకు 30 వేల బిల్ పడినట్లే.

ఆ నంబర్స్ నుండి ఫోన్ వస్తే చాలు..! మీకు 30 వేల బిల్ పడినట్లే.

Author:

Wrong Call

మొబైల్ అన్నాక రాంగ్ కాల్స్ రావడం సహజం అని అనుకుంటాం. కానీ కొన్ని సమయాలలో కస్టమర్ కేర్ నుండి వచ్చే కాల్స్ చిరాకు తెప్పిస్తాయి కధ! కానీ ఒక కాల్ వస్తే మాత్రం మనం కాల్ లిఫ్ట్ చేయాకపోయిన డబ్బులు బ్యాలెన్స్ కట్ అవుతాయా ? ఏదో నంబర్ నుంచి రాంగ్ కాల్ వస్తే మన ఫోన్‌లో బ్యాలెన్స్ కట్ అవ్వడం ఏమిటనేగా మీ సందేహం. ఈ విషయం వినటానికి వింతగా ఉన్న ఇది నిజం బ్రిటన్‌లో ఇప్పుడిదో కొత్త దందా. 0843, 0846 నంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తే చాలు. ఆ కాల్ ఏ నంబర్‌కైతే వచ్చిందో ఆ నంబర్‌కు 30వేలకు పైగా బిల్ పడుతుంది. ఈ నెంబర్ సిరీస్ బ్రిటన్‌లోని ప్రముఖ టెలికాం సంస్థదని తేల్చారు. ఆ నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఒక సెకండ్ మాత్రమే వస్తుంది, అలా మిస్డ్ కాల్ వచ్చిందంటే చాలు ఆ వెంటనే ఆ ఫోన్ ని హ్యాక్ చేస్తారు, ఆ వెంటనే మనకి తెలియకుండా మిస్డ్ కాల్ వచ్చిన నెంబర్ కి మన ప్రమేయం లేకుండానే రిటర్న్ కాల్ వెళ్తుంది, అలా 12 గంటల వరకు రిటర్న్ కాల్ ఆన్ లోనే ఉంటుంది, రిటర్న్ కాల్ ఆన్ లో ఉన్నట్టు కూడా మనకి తెలియదు, రిటర్న్ కాల్ డీటెయిల్స్ ఫోన్ కాల్ లిస్టులో కూడా ఉండవు కాని 50 నుండి 300 పౌండ్ల బిల్ మాత్రం వస్తుంది.

ఈ విషయంపై ఒక కస్టమర్ తనకు జరిగిన విషయన్ని పక్క సమాచరంతో క్లారిటీ ఇచ్చింది. ఈ కస్టమర్ కి ప్రతి నెల 9 పౌండ్లు కంటే బిల్లు ఎక్కువ రాదట!(మన కరెన్సీలో దాదాపు 900రూపాయలు), ఒక సారి పైన పేర్కొన్న నంబర్ సీరిస్ నుండి ఒక సారి ఫోన్ కాల్ వచ్చిందట! అంతే తర్వాత తనకు 90 పౌండ్ల(9000 రూపాయలు) బిల్ వచ్చిందట!.

ఈ పరిస్థితి ఒక్కరికే కాదు చాలా మందికి జరుగుతుందట! ఎక్కువగా వోడఫోన్ సిమ్ వాడుతున్నవారికి జరుగుతుందట! ఇక కస్టమర్లంత ఆ కంపెనీకి మొరపెట్టుకుంటున్నారు. దానితో సదరు కంపెనీ కావలనే ఎవరో తమ కంపెనీ సిరీస్‌ను కుట్రపూరితంగా దుర్వినియోగం చేస్తున్నారని చేస్తున్నట్లు తేల్చింది. సైబర్ నేరగాళ్లు టెలికాం కంపెనీని టార్గెట్ చేసుకుని ఈ చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. బ్రిటన్ ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేపట్టింది. ఇండియా, అమెరికా, బ్రిటన్ లక్ష్యంగా చేసుకుని నైజీరియాకి చెందినా సైబర్ నేరగాళ్లు వ్యూహం పన్నినట్లు తేలింది. ఇండియాలో టెలికాం కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ హెచ్చరించింది. కావున అలాంటి నెంబర్ ల నుండి ఎటువంటి మెసేజ్ లు గాని, మిస్డ్ కాల్స్ గాని వస్తే వెంటనే సైబర్ సెక్యురిటీ వాళ్ళకి ఫిర్యాదు చేయండి.

Must Read: స్మార్ట్ ఫోన్ పోతే గూగుల్ మ్యాప్స్ సహాయంతో కనిపెట్టవచ్చు.

(Visited 6,463 times, 1 visits today)