Home / Entertainment / మెగాస్టార్, దర్శకరత్న ల మధ్య కత్తి యుద్దం.

మెగాస్టార్, దర్శకరత్న ల మధ్య కత్తి యుద్దం.

Author:

Chiranjeevi Katthi Cinema

చిరంజీవి తెలుగు సినిమా రంగంలో ఒక దృవ తారా. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానం తో పాటు యావట్ భారత ప్రేక్షకుల ప్రేమను చూరగొన్న వక్తి. చిరంజీవి ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడం తో సినిమాలకు దూరం అవ్వదం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం మనకు తెలిసిందే, అంతకు ముందు చాలా రోజులు చిరంజీవి తన సినిమా కోసం చాలా స్టోరిస్ విన్నాడు కానీ చివరకు తమిళంలో సూపర్ హిట్అయిన కత్తి సినిమాను చిరంజీవి 150వ చిత్రంగా ఎంచుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మెగా తనయుడు రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్తో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా కొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనున్న నేపథ్యంలో ఉండగా ఇంతలో ఈ సినిమాకి ఓ ఊహించని తలనొప్పి మొదలైనది. ఈ సినిమా కథ తనదే అంటూ ఎన్.నరసింహారావు అనే రచయిత వెలుగులోకి వచ్చి కత్తి మేకర్స్, డైరెక్టర్ మురగదాస్ పై కథాహక్కుల వేదిక అయిన ‘తెలుగు కథారచయితల సంఘం’ కు కంప్లైంట్ చేశాడు.

‘తెలుగు కథారచయితల సంఘం’ అధ్యక్షుడు అయిన దాసరి నారాయణరావు ఈ విషయాన్నీ పరిశీలించిన తర్వాత కత్తి రీమేక్ నిర్మాణం పై ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది.కత్తి సినిమా కథ నరసింహారావుదే అని, అతనికి పూర్తి న్యాయం జరిగిన తర్వాత కత్తి రీమేక్ నిర్మాణ పనులు చేపట్టామని సూచించారు. అంతే కాదు రచయితా నరసింహారావుకు న్యాయం జరిగేంత వరకు 24 విభాగాలకు చెందినవారు చిరు 150వ సినిమాకి సహాయ నిరాకరానని ప్రకటించడమే కాదు మిగితా సినీ కార్మిక సమాఖ్య కూడా దీనికి మద్దతు ఇవ్వాలని కథ హక్కుల వేదిక ఫిల్మ్ ఫెడరేషన్ ని కోరింది.

(Visited 168 times, 1 visits today)