Home / Inspiring Stories / Video: కలిసోచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడుతాడంటే ఇదేనేమో?

Video: కలిసోచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడుతాడంటే ఇదేనేమో?

Author:

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే నమ్ముతాం కానీ పిల్లాడు పుట్టగానే నడవడమేంటీ ? నమ్మలేకపోతున్నారా? మీరే కాదు ప్రపంచమంతా నివ్వరపోయే వార్తే ఇది.. కానీ ఇది పచ్చి నిజం. ఒక తల్లి కడుపులోంచి బయటకు తీసిన బాబు బొడ్డు కోసి శుభ్రం చేసి పడుకోపెట్టేలోపే నడవడానికి ప్రయత్నించి ఆ డాక్టర్లకు షాక్ ఇచ్చాడు. షాక్ అయిన ఆ డాక్టర్లు ఆ బాబు తల్లి దండ్రులకు ఈ విషయం చెప్పగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక వైపు బిడ్డ పుట్టాడన్న ఆనందం అంతలోనే ఏకంగా నడిచే ప్రయత్నం చేసాడన్న షాకింగ్ న్యూస్..ఒక వైపు ఆశ్చర్యం..మరో వైపు ఆనందం. ఇక ఆ ఈ వార్త డాక్టర్లు, బిడ్డ పేరెంట్స్ కే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బుడ్డోడు పుట్టగానే ఫేమస్ అయిపోయాడు.

ఈ సంఘటన రెండు రోజుల క్రితం అంటే మే 26వ తేదీన జరిగింది. ఆపరేషన్ ధియేటర్ లో తీసిన ఆ బుడ్డోడి వీడియో ఫేస్ బుక్ లో పోస్ట్ అయ్యింది. తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన బాబు డాక్టర్ చేతిలో ఉండగానే, కాళ్లు ఆడిస్తూ నడవటానికి ప్రయత్నిస్తున్నాడు. కళ్ళు కూడా తెరవని ఆ పిల్లాడు చక్కగా కాళ్లు కదిలిస్తూ బుడిబుడి అడుగులు వేసేశాడు. అయితే పుట్టగానే ఇలా నడిచే ప్రయత్నం చేయడం నిజంగా వండర్ అంటున్నారు వైద్యులు. అసలు ఇలా ఎలా జరిగిందో కూడా అర్థం కాలేదు అంటున్నారు. సాధారణంగా పిల్లలు నడవాలంటే.. కనీసం 9 నుంచి 12 నెలల సమయం పడుతుంది. కానీ ఈ పసిగుడ్డు మాత్రం పుట్టగానే ఆపరేషన్ ధియేటర్ లోనే అడుగులు వెయ్యటం నిజంగా విచిత్రం. అయితే ఈ సంఘటన ఏ దేశంలో జరిగింది, ఈ బిడ్డ తల్లిదండ్రులేవరు లాంటి విషయాలను మాత్రం వెల్లడించలేదు. నమ్మలేని ఈ నిజాన్ని నమ్మితీరాలంటే ఈ క్రిందనున్న వీడియో లింక్ చూడండి.

(Visited 3,159 times, 1 visits today)