Home / Entertainment / నితిన్ కి ‘అ…ఆ’ నేర్పిస్తున్న త్రివిక్రమ్

నితిన్ కి ‘అ…ఆ’ నేర్పిస్తున్న త్రివిక్రమ్

Author:

Nithin And Samantha at Aa..Aa Movie Shooting

కొంత మంది మాటలకు ముత్యాలు రాలుతాయి కానీ త్రివిక్రమ్ మాటలకు బాక్సఫీస్ దగ్గర కాసుల వర్షం కురుపిస్తాయి. చిలిపితనం,వెటకారంతో పాటు హృదయాలను గుచ్చే మాటలు రాస్తాడు.. “అమ్మాయిలకు ప్రేమించటానికి టైం ఉంటుంది కాని పెళ్ళి చేసుకోవడానికి ధైర్యం ఉండదు, ప్రేమించినప్పుడు పెద్దవాళ్ళు గుర్తుకు రారు పెళ్ళి చేసుకున్నప్పుడు ప్రేమించిన వాడు గుర్తుకు రాడు” ఇలాంటివి మచ్చుకు మాత్రమే.

ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ‘అ…ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల రామానాయుడు స్టూడియోలో జరిగింది. గత నెలలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలో నితిన్ ఇద్దరు హీరోయిన్లతో డ్యూయోట్లు పాడుతున్నారు.

సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా…. మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమా ‘అత్తారింటికి దారేది’ మూవీలో కీలక పాత్ర పోషించిన నటి నదియా కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రముఖ సౌత్ సినిమాటోగ్రాఫర్ నట రాజన్ సుబ్రహ్మణ్యం, యువత సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. సినిమా షూటింగ్ గ్యాపులో సమంత, నితిన్ రిలాక్స్ అవుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

(Visited 213 times, 1 visits today)