Home / Inspiring Stories / మడమ తిప్పని కలెక్టర్…తోక ముడిచిన ప్రజా ప్రతినిధులు

మడమ తిప్పని కలెక్టర్…తోక ముడిచిన ప్రజా ప్రతినిధులు

Author:

ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఇది సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించారు నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా. అంతే కాదు..తాను తీసుకునున్న స్టాండ్ కు సోషల్ మీడియా నుంచి మద్దతు కూడగట్టగలిగారు. నియోజక అభివృద్ధి నిధుల పనుల ఖర్చు, నాణ్యత, దుర్వినియోగంపై నిజామాబాదు కలెక్టర్ డాక్టర్ యోగిత రాణా గారు థర్డ్ పార్టీ విచారణ,  తనిఖి చేయించటం పార్టీలకతీతంగా అక్కడి ప్రజా ప్రతినిధులను ఏకం చేసింది. దీంతో తమ బండారం ఎక్కడ బయట పడుతుందో అని భయపడిన ప్రజా ప్రతినిధులు జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ ను టార్గెట్ చేశారు.. మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఎం ఎల్ ఏ ల వ్యతిరేకతను తిప్పి కొడుతూ కలెక్టర్ అంతకు పదింతలు తీవ్రంగా స్పందించారు.. మొక్కవోని ధైర్యం తో నిక్కచ్చిగా సమాధానం ఇచ్చి ఎం ఎల్ ఏ ల నోరు మూయించారు.

ఈ ఎపిసోడ్ లో ఎం పీ పీ లు, జెడ్ పీ టీ సీ లు ..ఎం ఎల్ ఏ లకు మద్దతు పలికినప్పటికీ, యోగితా రాణా వెన్ను చూపలేదు. “నా పాలన రాజకీయ నాయకుల కోసం కాదు.. రాజీ పడని అభివృద్ధి కోసం.. అవినీతి లేని అభివృద్ధి కోసం.. నేను డ్యూటీ మాత్రమే చేయటం లేదు.. ప్రజలకు సేవ చేస్తున్న.. నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తా..” అంటూ గట్టిగా వినిపించారు తన వాయిస్ నిజామాబాదు కలెక్టర్ డాక్టర్ యోగిత రాణా . హ్యాట్సాఫ్ కలెక్టర్ గారూ..మీబోటి అధికారులు మరింత మంది రావాలంటూ….సోషల్ మీడియాలో ఆమెకు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం యోగితా రాణా ఎపిసోడ్ అటు ప్రశాసన్ నగర్ లోనూ, ఇటు సెక్రెటేరియట్ లోనూ ఎక్కువగా డిబేట్ అవుతోంది. జనం డబ్బుకు జవాబుదారీగా నిలబడటం కాదు, అవసరమైతే అది పరుల పాలు కాకుండా వాచ్ డాగ్ లాగా ఉండగల సత్తా ఆఫీసర్స్ కు ఉందని ఛాతీ చెప్పిన యోగితా రాణా మొక్కవోని ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్!

(Visited 263 times, 1 visits today)