Home / Political / సోషల్ మీడియా దెబ్బతో దిగివచ్చిన పార్టీలు…రేపు బంద్ లేదు కేవలం నిరసనే.

సోషల్ మీడియా దెబ్బతో దిగివచ్చిన పార్టీలు…రేపు బంద్ లేదు కేవలం నిరసనే.

Author:

పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి ప్రతిపక్షాలు. కాని ఆ పిలుపుని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఘోరంగా విఫలమయాయి. ప్రతిపక్షాలు బంద్ కి పిలుపునివ్వగానే దానికి పోటీగా ఫేస్ బుక్ మరియు ఇతర సోషల్ మీడియాలో బంద్ కి వ్యతిరేకంగా వేల మంది తమ ఆగ్రాహాన్ని వెలిబుచ్చారు.. చాలా మంది తాము ఈ బంద్ కి సపోర్ట్ చేయమని తమ స్టేటస్ ని మార్చారు. ఇప్పటికీ జనాలు డబ్బుకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.. రేపు బంద్ చేసి ఇంకా వారికి ఆటంకం కలిగించొద్దు అని చాలా మంది పోస్ట్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు రెండు బంద్ కి తాము వ్యతిరేకం అని ప్రకటించాయి. ఇక రేపటి బంద్ పై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టి కూడా మాట మార్చింది.

no-bharat-bandh

ఈ రోజు మీడియాతో మాట్లడిన కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ తాము కేవలం దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామే తప్ప భారత్‌ బంద్‌కు పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ భారత్‌ బంద్‌ను చేపడుతున్నట్లు భాజపా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందని తాము కేవలం నిరసన ను తెలపడం కోసం జన్‌ ఆక్రోశ్‌ దివస్‌ను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దీనితో అసలు రేపు బంద్ ఎవరు చేస్తారు అన్నది అర్దం కాకుండా పోయింది. ఇదంతా సోషల్ మీడియా సాధించిన విజయం అని చాల మంది అప్పుడే పోస్ట్ లు పెడుతున్నారు.

(Visited 2,378 times, 1 visits today)