Home / Inspiring Stories / నో హెల్మెట్..! నో పెట్రోల్..!!

నో హెల్మెట్..! నో పెట్రోల్..!!

Author:

హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోజుకి ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అని, ఖచ్చితంగా బైక్ పై వెళ్ళే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని ఎన్ని సార్లు హెచ్చరించిన మారట్లేరు, నెల రోజుల కిందట హెల్మెట్ లేకపోతే జరిమానాతో పాటు, కేసు కూడా నమోదు చేస్తాం అంటే పోలీసుల తనిఖీలు చేసినంతవరకు హెల్మెట్ ధరించారు ఆ తరువాత హెల్మెట్ గురుంచి అటు పోలీసులు, ఇటు బైక్ నడిపే వాళ్ళు మరిచిపోయారు.

No-Helmet-No-Petrol

ఎన్నిసార్లు తనిఖీలు చేసి హెచ్చరించిన హెల్మెట్ పెట్టుకోవట్లేదని పోలీసులు ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు, బైక్ నడవాలి అంటే పెట్రోల్ ఖచ్చితంగా కావాలి, కావున ఇప్పుడు ఆ పెట్రోల్ తోనే హెల్మెట్ పెట్టుకొని వారి పని పట్టాలని పోలీసులు డిసైడ్ అయ్యారు, జూలై 2వ తేది నుండి హెల్మెట్ పెట్టుకుంటేనే బండిలో పెట్రోల్ పోసేలా పెట్రోల్ బంక్ లకి ఆదేశాలు ఇవ్వనున్నారు, ఇప్పటికే ఈ విధానం బెంగళూరులో విజయవంతంగా సాగిపోతుంది, అక్కడ బైక్ తోలే వారికీ హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తారు, ఇదే విధానాన్ని మొదటగా జూలై 2వ తేది నుండి ఆదిలాబాద్ జిల్లాలో అమలు చేయనున్నారు, ఈ నిబంధనని అములు చేశాక ఎదురయ్యే ఇబ్బందులని, పరిస్థితులని పరిశీలించి అతి త్వరలో హైదరాబద్ లో అమలు చేయ్యాలని పోలీస్ శాఖా నిర్ణయించింది, ఈ దెబ్బతో ప్రాణాల కోసం కాకపోయినా పెట్రోల్ కోసమైనా హెల్మెట్ పెట్టుకుంటారు అని భావిస్తున్నారు. ఇలాగైన హెల్మెట్ పెట్టుకుంటారో, లేక పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకొని ఆ తరువాత పక్కకి పెడతారో చూడాలి…!

(Visited 647 times, 1 visits today)