Home / Inspiring Stories / అంబులెన్సుకి డబ్బులులేక భార్య శవంతో 60 కి.మీ ల కన్నీటియాత్ర.

అంబులెన్సుకి డబ్బులులేక భార్య శవంతో 60 కి.మీ ల కన్నీటియాత్ర.

Author:

అన్యోన్యంగా సాగిపోతున్న దంపతుల సంసార జీవితంలో కుష్ఠువ్యాధి అతలాకుతం చేసింది. ఉన్న డబ్బులన్నీ వ్యాధికి ఖర్చు అయిపోయాయి. ఉన్న ఊరిలో వారిని, వీరిని అడగలేక హైదరాబాద్ చేరారు. ఇక్కడ బిక్షాటన చేస్తూ ఉన్న రోజు తిన్నారు లేని రోజు పస్తులున్నారు. ఉన్నదాంట్లో కష్టం, సుఖం అనుభవించారు. ఒక్కసారిగా వ్యాధి ముదిరి భార్య చనిపోయింది. అప్పటివరకు తనతోపాటు మాట్లాడిన భార్య, ఒక్కసారిగా మూగబోవడంతో ఏమిచేయాలో తెలియని పరిస్థితి, సొంత ఉరికి తీసుకెళ్లడానికి డబ్బులేక ప్రాణాలు అవిసేలా అల్లాడిపోయాడు ఆ భర్త. ఎలాగైనా సరే తానూ పుట్టి, పెరిగి అనుబంధం ఉన్న ఊరిలో తన భార్య అంత్యక్రియలు చేయాలనుకున్నాడు. యాచనకు ఉపయోగించిన బండిలోనే భార్య శవాన్ని పెట్టుకొని 60 కిలోమీటలు తోసుకుంటూ వెళ్ళాడు. ముసలి ప్రాణం అన్ని కిలోమీటర్లు తోయడం శరీరంలో శక్తి నిరసించి ఒక్కసారిగా కూలిపోయాడు. కొద్దిగా తేరుకొని దగ్గరలోని ఒక టీ కొట్టు దగ్గర నీళ్లు తాగి తన శరీరంలో శక్తి లేదనుకొని భార్య శవాన్ని చూస్తూ కన్నీరు కార్చడం మొదలు పెట్టాడు…. హృదయాన్ని మెలిపెట్టే సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది.

this-person-carried-his-wifes-dead-body-over-a-pull-cart-1

సంగారెడ్డి జిల్లా, మనూరు మండలం,మాయికోడ్‌ కు చెందిన రాములు, కవిత ఇద్దరు దంపతులు. ఈ ఇద్దరు కుష్ఠువ్యాధితో బాధపడుతున్నారు. ఊరిలో బ్రతకడం కష్టమై హైదరాబాద్ లో బ్రతకడానికి వచ్చారు కానీ కొన్ని రోజులకే రాములు భార్య వ్యాధి ముదరడంతో చనిపోయింది. తన భార్యని అంబులెన్స్ లో తీసుకుపోవడానికి డబ్బులు లేక ఒకరి దగ్గర చక్రాల బండిని తీసుకోని తన సొంత ఉరికి బయలుదేరాడు. 60 కిలోమీటర్లు ప్రయాణించి వికారాబాద్ వరకు చేరుకున్నాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఇక బండిని తోచే శక్తిలేక కన్నీరు కరుస్తుంటే స్థాయినికులు రాములు బాధ చూడలేక స్థానిక సిఐ రవికి సమాచారం ఇచ్చారు. సిఐ వచ్చి వివరాలను సేకరించి స్వామి వివేకానంద సేవా సమితి అంబులెన్స్ ద్వారా రాములు సొంతూరికి పంపించాడు. అలాగే అంత్యక్రియల ఖర్చులకు 5000 వేల రూపాయలు ఇచ్చి తన మంచి మంచి మనసుని చాటుకున్నాడు. రాములు అంబులెన్స్ లో తన భార్య శవాన్ని తీసుకోని తన గ్రామనికి రాత్రి ఏడూ గంటల వరకు చేరుకున్నాడు….. ఇది రాములు అనుభవించిన ఒక దీన కథ…

(Visited 290 times, 1 visits today)