Home / Inspiring Stories / అంబులెన్సు కి డబ్బులు లేక భుజంపై భార్య శవంతో 10కి.మీ.లు నడిచాడు.

అంబులెన్సు కి డబ్బులు లేక భుజంపై భార్య శవంతో 10కి.మీ.లు నడిచాడు.

Author:

ఒడిశా రాష్ట్రానికి చెందిన దానా మాఝీ అంత్యంత కటిక పేదరికుడు, అతనిది ఒడిషాలోని అత్యంత వెనకబడిన గ్రామం మేల్ఘారా, మాఝీ భార్య అమంగ దేవికి క్షయ వ్యాధి రావడంతో వైద్యం చేయించడానికి డబ్బులు లేకున్నా ఎలాగోలా కష్టపడి వాళ్ళ గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవానిపట్నం పట్టణంలోని హాస్పిటల్ లో వైద్యం చేయించాడు, వైద్యం వికటించి మాఝీ భార్య మరణించింది,భార్య పోయిందన్న దుఃఖం కంటే..ఆ తర్వాత పరిస్థితులే కన్నీళ్లు తెప్పించాయి మాఝీకి. అప్పటికే ఉన్న డబ్బులన్ని అయిపోవడంతో భార్య శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి చిల్లిగవ్వ కూడా మాఝీ జేబులో లేవు.

తన దయనీయ పరిస్థితిని ఆసుపత్రి అధికారులకి చెప్పి, భార్య శవాన్ని తీసుకెళ్లడానికి ఒక వాహనంని ఏర్పాటు చేపించాలని ఎంత మొరపెట్టుకున్నా ఎవ్వరు వినిపించుకోలేదు,  హాస్పిటల్ లో ఉన్న అంబులెన్సు కి ఇవ్వడానికి మాఝీ దగ్గర ఒక్క పైసా లేదు, కనీసం బస్సు లో తీసుకోళ్ళడానికి కూడా మాఝీ దగ్గర డబ్బులు లేవు, కనీసం ప్రభుత్వ అంబులెన్సు ని ఏర్పాటు చేయడానికి ఎవరు సహాయం చేయలేదు, ఇక చేసేదేం లేక భార్య శవాన్ని భుజాన వేసుకొని, తన 12 ఏళ్ళ కూతురితో కలిసి నడుచుకుంటూ తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భార్య మృతదేహాన్ని ఓ వస్త్రంతో కప్పేసి.. చాపతో చుట్టేశాడు. భార్య శవాన్ని భుజాన వేసుకొని.. ఇంటిబాట పట్టాడు. పన్నెండేళ్ల కూతురు కూడా తండ్రి అడుగులో అడుగు వేసింది. పది కిలోమీటర్లు అలా నడుస్తూ వెళ్లారు. అలా పది కిలోమీటర్లు వెళ్లిన తరువాత కొంతమంది మీడియాకి చెప్పటంతో వారు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఒక అంబులెన్సు ని ఏర్పాటు చేసారు.


ప్రతిరోజు పేపర్లలో, టీవీలలో దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది, అందరి కంటే ఎక్కువ జీడీపీని సాధిస్తుంది అని వస్తుంది, ప్రభుత్వాలు కూడా అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెడుతున్నారు కానీ అవన్నీ మాఝీ లాంటి సామాన్య మానవులకి చేరటం లేదు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన, ఎన్నిపథకాలు ప్రవేశ పెట్టిన అవి పేదవారికి బతుకుల్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోతున్నాయి, ఇలాంటి సంఘటలని చూసి అయిన ప్రభుత్వాలు మారాలని కోరుకుందాం.

(Visited 138 times, 1 visits today)