Home / Inspiring Stories / RBI కొత్తరూల్:బ్యాంకు అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలన్న నింబంధన లేదు.

RBI కొత్తరూల్:బ్యాంకు అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలన్న నింబంధన లేదు.

Author:

ఇప్పుడు ప్రతి పనికి బ్యాంకు ఖాతా ఖచ్చితంగా ఉండాల్సిందే, గ్యాస్ కావాలన్నా, పింఛను డబ్బులు తీసుకోవాలన్న, ఉపాధి హామీ డబ్బులు తీసుకోవాలన్న ఖచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఉండాల్సిందే, కాని బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మినిమమ్ బ్యాలన్స్ పేరు మీద ఎంతో కొంత అమౌంట్ అకౌంట్ లో వేయాల్సి ఉంటది, అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత మినిమమ్ బ్యాలన్స్ ని సరిగ్గా మెయింటెయిన్ చేయకపోతే ఫైన్ పేరు మీద చార్జీలు వసూలు చేస్తారు, అకౌంట్ లో బ్యాలన్స్ లేకపోతే ఈ ఫైన్ వల్ల సున్నాగా ఉన్న వారి బ్యాలెన్స్ నెగెటివ్‌ బ్యాలన్స్ గా మారుతుంది. ఏదో ఒక ఉద్యోగం చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా మినిమమ్ బ్యాలన్స్ ని మెయింటెయిన్ చేస్తారు, కాని వ్యవసాయం చేసేవాళ్ళు, రోజు కూలికి వెళ్ళేవాళ్ళు, ఆటోలు నడిపేవారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు మాత్రం వారి బ్యాంకు అకౌంట్ లలో మినిమమ్ బ్యాలన్స్ ని మెయింటెయిన్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, బ్యాంకులు ఫైన్ రూపంలో వసూలు చేసే అకౌంట్ లలో పేదవారి అకౌంట్ లే ఎక్కువగా ఉన్నాయి, అందుకే రిజర్వ్ బ్యాంకు నెగెటివ్ బ్యాలెన్స్ వ‌చ్చేలా ఫైన్ వేసే బ్యాంకుల‌ను హెచ్చ‌రిస్తూ ఆర్‌బీఐ (రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజాగా ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

rbi-charges-zero-balance-negative-balance

ఆ ప్రకటన ప్రకారం బ్యాంకులు ఫైన్ రూపంలో జీరో బ్యాలన్స్ అకౌంట్ లలో నెగటివ్ బ్యాలన్స్ ని చూపించడానికి వీల్లేదు, అలా ఏ బ్యాంకు అయిన నెగిటివ్ బ్యాలన్స్ ని చుపించినట్లయితే వెంటనే బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అలా చేస్తే రిజర్వ్ బ్యాంకు ఆ బ్యాంకు పై చర్యలు తీసుకొని ఖాతాదారునికి నష్ట పరిహారం ఇప్పిస్తుంది. ఇలా చేయడం వల్ల జీరో బ్యాలెన్స్ ఉన్నా ఇక‌పై చార్జ్‌లు ఏమీ ప‌డ‌వ‌న్న‌మాట‌. దీంతో ఇంకా ఎక్కువ మంది బ్యాంక్ అకౌంట్ల‌ను ఓపెన్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని దాదాపు అధిక శాతం మంది వినియోగ‌దారులు ఆహ్వానిస్తున్నారు. నిజ‌మేగా మ‌రి! ప్ర‌ధానంగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది క‌దా!

Must Read: మీకు 10 సంవత్సరాల లోపు అమ్మాయి ఉందా? అయితే మీకో శుభవార్త.

(Visited 4,299 times, 1 visits today)