Home / Inspiring Stories / నన్ను కాపాడే ఒక్క మగాడు లేడా?

నన్ను కాపాడే ఒక్క మగాడు లేడా?

Author:

నన్ను కాపాడే మగాడు ఒక్కడు కూడా లేడా? ఇది నిన్నటి నుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రశ్న. చెన్నై లోని ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణహత్య తర్వాత ఈ ప్రశ్న తో ఫేస్‌బుక్ లో పలువురు పోస్ట్ లు పెట్టారు. పట్టపగలు నుంగంబాక్కం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం పై ఒక అమ్మాయిని దారుణంగా చంపుతుంటే చూస్తూ ఊరుకున్న వారిపై సోషల్ మీడియాలో ప్రజలు మండిపడ్డారు. రైల్వే స్టేషన్లో ఉన్న అంత మందిలో ఏ ఒక్కరూ ఎదురించిన ఆ అమ్మాయి ప్రాణాలు దక్కేవని, ఎవరు హంతకుణ్ణి ఆపకపోవడం వలనే ఈ హత్య జరిగిందని ఈ హత్యలో ఆ రైల్వే స్టేషన్ లో ఉన్నావారందరు పాలు పంచుకున్నట్లే అని వాపోయారు.

Swathi dead body on platform

ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు రోజు వార్తల్లో చూస్తూ ఉంటాము. కానీ అవన్నీ ఎవరికి తెలియని రీతిలో, అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు జరుగుతుండడంతో మనము ఎం చేయలేము అని మనకు మనం సర్ది చెప్పుకుంటాం. మరి మొన్న జరిగిన సంఘటన అలాటింది కాదు, చాలా మంది చూస్తుండగా ఉద్యోగానికి వెళుతున్న ఒంటరి ఆడపిల్లను అతి దారుణంగా గొంతు కోసి చంపినా ఆపే నాదుడే లేకుండా పోయాడు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనలోని మంచితనం కేవలం డొళ్ళతనమనే  తెలిసిపోతుంది. ఆ డొల్లతనాన్ని గుర్తు చేయడానికే “నన్ను కాపాడే మగాడే లేడా?” అన్న ప్రశ్న సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికైనా మనుషులు మారాలి.

Must Read: ఇంత అవినీతా..? 50 లక్షల పనికి 58 కోట్లు లెక్క చెప్పిన ప్రభుత్వం.

(Visited 3,130 times, 1 visits today)