Home / Political / సోషల్ మీడియా వేదికగా బ్యాంకుల పై పోరాటం…!

సోషల్ మీడియా వేదికగా బ్యాంకుల పై పోరాటం…!

Author:

బ్యాంకులో డబ్బులు వేసిన..తీసిన..మినిమమ్ బ్యాలన్స్ లేకున్నా, ఏటీఎం నుండి విత్ డ్రా చేసుకున్న చార్జీల రూపంలో బాదడానికి అన్ని బ్యాంకులు రంగం సిద్ధం చేసాయి, . అత్యవసరం అయినా సరే.. మన డబ్బుని మనం తీసుకోవటానికి అయినా సరే ఛార్జీలు కట్టాల్సిందే అంటున్నాయి బ్యాంకులు, మనం కష్టపడి సంపాదించిన డబ్బే అయినా వాటిని వాడుకోవాలంటే మాత్రం చార్జీలు చెల్లించాల్సిందే అనేట్లుగా సరికొత్త నిబంధనాలని బ్యాంకులు తీసుకొస్తున్నాయి, ఇప్పటికే Axis , HDFC , ICICI బ్యాంకులు చార్జీలు వాసులు చేయటం ప్రారంభించాయి, మరికొన్ని రోజులలో ప్రభుత్వ బ్యాంకు అయిన SBI తో పాటు అన్ని బ్యాంకులు అదే బాటలో నడవనున్నాయి.

బ్యాంకులు అనుసరిస్తున్న ఈ కొత్త విధానాలపై ఖాతాదారులు మండిపడుతున్నారు, మా డబ్బు మేము తీసుకోవడానికి ఎందుకు ఫైన్ కట్టాలని బ్యాంకు అధికారులని ప్రశ్నిస్తున్నారు.., సోషల్ మీడియా వేదికగా బ్యాంకులపై ఉద్యమానికి పిలుపునిచ్చారు. బ్యాంకుల వైఖరికి వ్యతిరేకంగా ఏప్రిల్ 6 న నో ట్రాన్సాక్షన్ డే ప్రకటించి ఆరోజు బ్యాంకులలో ఎటువంటి లావాదేవీలు చేయొద్దని ప్రచారం చేస్తున్నారు,ఏప్రిల్ ఆరవ తేదీన దేశంలో ఎవరూ బ్యాంకులకు వెళ్లొద్దు.. లావాదేవీలు జరపొద్దు అని పిలుపునిస్తున్నారు. ఆన్ లైన్, మొబైల్, పేటీఎం ఇలా అన్ని లావాదేవీలు జరపొద్దని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. RBI కొత్త రూల్స్, బ్యాంకుల బాదుడుపై ఖాతాదారులు దండయాత్రకు రెడీ అవుతున్నారు. మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా జరుగుతున్న ప్రచారానికి.. కొన్ని జాతీయ పత్రికలు కూడా ప్రముఖంగా చోటివ్వటం విశేషం.

no transaction day

ఏప్రిల్ 6వ తేదీ నో ట్రాన్సాక్షన్ డేకు RBI, బ్యాంకులు దిగిరాకపోతే.. మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏప్రిల్ 24, 25, 26 మూడు తేదీలను నో ట్రాన్సాక్షన్ డేలుగా జరుపుకోవాలని స్లోగన్స్ ఇస్తున్నారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క పౌరుడికి, బ్యాంక్ ఖాతాదారుడికి చేరేలా వెళ్లాలని కూడా రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ ల్లో షేర్స్ చేస్తూ.. బ్యాంకులపై దండయాత్ర చేస్తున్నారు. సోషల్ మీడియాలో పుట్టిన ఈ ఉద్యమానికి కేంద్రం స్పందన ఎలా ఉంటుంది.. బ్యాంకులు దిగి వస్తాయా లేదా అనేది వేచిచూడాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో #notransactionday హ్యాష్ ట్యాగ్ పేరుతో వైరల్ అవుతోంది.

(Visited 1,102 times, 1 visits today)