Home / Inspiring Stories / రైలులో ప్రయాణించాలనుకునే వారికీ గుడ్ న్యూస్.

రైలులో ప్రయాణించాలనుకునే వారికీ గుడ్ న్యూస్.

Author:

వెయిటింగ్‌ లిస్ట్‌ లో ఉంది… టికెట్‌ కనఫర్మ్‌ అవుతుందా అనే ప్రశ్నకు రైల్వేలో ఇక తావులేదు… ఎందుకంటే వెయిటింగ్‌ లిస్ట్‌ను భారత రైల్వేశాఖ శాశ్వతంగా రద్దు చేసింది. ఇక నుంచి రైళ్లలో సీటు కనఫర్మేషన్, ఆర్‌ఏసీ మాత్రమే ఉంటుంది. అంతేకాదు తత్కాల్‌ రద్దు చేసుకుంటే 50 శాతం డబ్బు తిరిగి చెల్లింపు, రాజధాని, శతాబ్ధి రైళ్లలో పేపర్‌లెస్‌ టికెట్‌లు తదితర నూతన నిబంధనలు జూలై 1 నుంచి రైల్వేశాఖ అమలు చేయనుంది. ప్రస్తుతం టికెట్‌ రిజర్వేషనలో కనఫర్మ్‌, ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ అమలులో ఉంది. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండే ఖాళీల మేరకు ముందు ఆర్‌ఏసీ, ఆ తరువాత కనఫర్మేషన్ జరుగుతోంది. ఈ విధానంతో వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు సంబంధిత రైల్లో బెర్త్‌ మాటేమోగానీ కనీసం సీటు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో రైల్వేశాఖ ప్రయాణికుల ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని వెయిటింగ్‌ లిస్ట్‌ను పూర్తిగా రద్దు చేసింది.

No Waiting List for Train Ticket1

ఇకనుంచి కనఫర్మేషన్, ఆర్‌ఏసీ (రిజర్వేషన అగైనెస్ట్‌ క్యాన్సిలేషన్) మాత్రమే ఉంటుంది. జూలై 1 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఈ మేర కు రైల్వేశాఖ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందని రైల్వే అధికారుల సమాచారం. ఆర్‌ఏసీ ఉంటే బెర్త్‌ దొరకకున్నా, కూర్చోవడానికి సీటు మాత్రం ఖాయంగా దొరుకుతుంది. అయితే ఆర్‌ఏసీ దొరకని ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నపుడు అదే మార్గంలో ‘సువిధా’ పేరుతో ప్రత్యేక రైలును నడిపి వీరిని అందులో పంపిస్తారని రైల్వే అధికారుల సమాచారం. ‘సువిధా’ రైళ్లలో టికెట్‌ రద్దు చేసుకుంటే 50 శాతం డబ్బు లు తిరిగి చెల్లిస్తారు. తత్కాల్‌ టికెట్లు రద్దు చేసుకుంటే ప్రస్తుతం డబ్బులు చెల్లించడం లేదు. నూతన నిబంధనల ప్రకారం 50 శాతం డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. సవరించిన ప్రకారం తత్కాల్‌ రిజర్వేషన్ కౌంటర్లు ఏసీకి ఉదయం 10 గంటల నుంచి 11 వరకు, స్లీపర్‌కు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి.

రాజధాని, శతాబ్ధి రైళ్లలో ఇక నుంచి పేపర్‌లెస్‌ టికెట్‌లు (మొబైల్‌ టికెట్‌లను) మాత్రమే అనుమతిస్తారు. ఆనలైన టికెట్‌ను మొబైల్‌లో డౌనలోడ్‌ చేసుకోవచ్చు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరే సందర్భంలో వేక్‌ప కాల్‌ సదుపాయంతో పాటు గా ఐఆర్‌టీసీ వెబ్‌సైట్‌ నుంచి పలు భాషలలో టికెట్‌లు బుకింగ్‌ చేసుకునే సదుపాయం కూడా జూలై 1 నుంచి అమలులోకి రానుంది. మొత్తం మీద భారత రైల్వేలో ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మిగిలిన శాఖాలలో కంటే ఎక్కువ అభివృద్ధి రైల్వే శాఖలో కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Must Read: ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి.

Source: Andhrajyothi.com

(Visited 12,978 times, 1 visits today)