Home / Political / ప్రతీ మూడురోజులకి ఒకసారి “మంచినీళ్ళ సెలవు” తీసుకుంటున్న మహిళా ఉద్యోగులు

ప్రతీ మూడురోజులకి ఒకసారి “మంచినీళ్ళ సెలవు” తీసుకుంటున్న మహిళా ఉద్యోగులు

Author:

ఎండలు మండిపోతున్నాయి ఊళ్ళకు ఊళ్ళే దాహం తో అల్లాడుతున్నాయి ఇక నగరాల సంగతి చెప్పనే అక్ఖర్లేదు మంచినీళ్ళకోసం యుద్దాలే జరిగేలా ఉంది పరిస్థితి. జార్ఖంద్ రాజధని రాంచి లో పరిఒస్థితి మరింత ధారుణంగా ఉంది ప్రతీ మూడురొఈజులకొకసారి మాత్రమే నీళ్ళు రావటం వళ్ళ వారం లో రెండు రోజులు “మంచినీళ్ళ సెలవు దినాలుగా మారిపోయాయి. ప్రతీ మూడు రోజులకూ ఒకసారి వీథుల్లోని అందరూ మంచి నీళ్ళు తీసుకు వచ్చే మునిసిపాలిటీ వాటర్ ట్యాంకర్ కోసం ఉదయం ఆరు గంటలనుండే క్యూలల్లో నిలబడుతున్నారు… ఇలా ఒక్కోరోజూ మద్యాహ్నం వరకూ అలానే నిలబడాల్సి వస్తోంది. “రెండు బకెట్లు నీళ్ళు దోరికిన రోజు నేను అదృష్ట వంతురాలిని అనుకుంటాను,ఆ రెండు బకెట్లకోసం కనీసం నేను 4 గంటల పాటు క్యూలో నిల్చొని ఎదురు చూస్తాను ఊక్కోరో కనీసం, అరబకెట్ కూడా దొరికే పరిస్తిథి లేదు” అంటూ రాంచీ మునిసిపాలిటీలో పని చేసే మహిళా ఉద్యోగి రీతా దేవీ మీడియా కి చెప్పారు. వారం లో ప్రతీ మూడురోజులకీ ఒకసారి ఏదో ఒక అబద్దం చెప్పి లీవ్ తీసుకొని మరీ మంచినీళ్ళ కోసం క్యూలో నిలబడుతున్నారట ఆవిడ..
మహారాష్ట్రలో… గొంతు తడపుకోవడం కోసం… బావుల్లోకి దిగక తప్పడంలేదు మరాఠీలకు… చిన్నచిన్న పిల్లలను నీళ్ళ కోసం బావుల్లోకి దింపుతున్నారు మహారాష్ట్రలోని ముర్కుత్ వాడి గ్రామ ప్రజలు. బోరుబావులు ఎండిపోవడంతో నీరు లేక అల్లాడుతున్న జనాలు బావుల్లో అడుగున ఉన్న నీళ్ళ కోసం అష్టకష్టాలుపడాల్సి వస్తోంది. ఎక్కడో అడుగులో ఉన్న నీళ్ళకోసం చిన్న పిల్లలు సాహాసం చేయక తప్పడంలేదు. తాడు కట్టుకొని నీళ్ళ బిందె లు తీసుకొని బావిలోకి దిగి… అదే తాడుకి నీళ్ళు నింపిన బిందెలను పైకి చేర్చుతున్నారు. దాదాపు 60 అడుగుల లోతు ఉన్న బావుల్లోకి పిల్లలు దిగుతుండటంతో బాలల హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ తంతు మూడేళ్ళ నుంచి జరుగుతోందని చెబుతున్నారు అక్కడి జనం. కేవలం నీళ్ళ కోసమే స్కూల్స్ కి సెలవు పెడుతున్నామని చిన్నారులు అంటున్నారు.
ఇక మన రాష్ట్రాల సంగతికి వస్తే తండాలు, గ్రామాల్లో కొంత ఉపయోగకరంగా ఉండే బోర్లు బావురుమంటున్నాయి. గంట నుంచి మూడు గంటల వరకు చేతులు నొప్పులు పుట్టేలా కొట్టినా చుక్క నీళ్లు రాని దుస్థితి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ పరిధిలోని నార్నూర్, జైనూర్, సిర్పూర్, ఇంద్రవెల్లి, కెరామెరీలాంటి ఏజెన్సీ మండలాల్లో నీటి వనరులు పూర్తిగా అడుగంటడంతో 70కి పైగా గ్రామాలు తండాలు నీటికోసం అల్లల్లాడిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఉదయం లేవగానే మొదట చేసే పని.. నీటి కోసం యాత్ర చేపట్టడం.. బిందెలు, క్యాన్లు చేతపట్టి భగభగమండే ఎండలో ప్రయాణించక తప్పడంలేదు. కుటుంబంలోని పిల్లా జెల్లా దాహం తీర్చాలంటే ఈ మాత్రం అవస్తలు పడక తప్పడం లేదు.
నల్లగొండ జిల్లాలో ఎండకాలం ప్రారంభంలోనే ప్రధాన పట్టాణాల్లో పూర్తిగా నీటి కొరత ఏర్పడింది. నల్లగొండ పట్టణంలో లక్షన్నర మంది నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీరందరికి రోజు మంచి నీరు అందించాలంటే 22.5ఎంఎల్‌డీలు అవసరం.పట్టణంలోని ప్రజలందరికి ఫ్యూరిఫైడ్ వాటర్ ,ట్యాంకర్లే దిక్కుగా మారాయి. ఇక ట్యాంకర్ లు సరియైన సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు. వచ్చే కోద్దిపాటి నీరు కూడా మురికి నీరుగా వస్తుందంటున్నారు మహిళలు.. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. జిల్లాలో 21 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని అధికారులు అంటున్నారు. అందులో మఠంపల్లి మండల కేంద్రం, రఘునాధపాలెం గ్రామాలు ఉన్నాయి. ఐదు మండలాల్లో 228 ప్రాంతాల్లో 2,238 చేతిపంపులు ఉన్నాయి. అందులో సగానికి పైగా పనిచేయడంలేదు. 552 పవర్‌బోర్లు ఉన్నా, నీరు అడుగంటికొన్ని, మోటార్లు కాలిపోయి సుమారు 150కి పైగా పనిచేయడం లేదు. ఏప్రిల్‌ చివరినాటికి 80శాతం బోర్లు అడుగంటిపోయే పరిస్థితి నెలకొంది.మేళ్లచెర్వు, మఠంపల్లి, నేరేడుచర్ల మండలాల్లోని సిమెంట్‌ పరిశ్రమల వారు సైతం తమ పరిధిలోని గ్రామాలకు ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించి సహకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో నీరు లేక గొంతు ఎండే పరిస్థితి ఉందని, ముగజీవాలకు పరిస్థితి ఏంటని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని కోరుతున్నారు.

(Visited 136 times, 1 visits today)