Home / health / ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

Author:

కల్తీ ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్ నుంచి పిల్లల్ని కాపాడుకొంటున్న తల్లులు బహుపరాక్ ! పిల్లలకు కొన్ని రకాల పండ్లు కలిపి పెట్టనే కూడదు. షోషకాహార లోపాలు సరిచేసు కోవడానికి పళ్ళు మంచి ప్రత్యామ్నాయం. అయితే సిట్రస్ జాతి పళ్ళు కలిపి తినేటప్పుడు జాగ్రత్త. ఏయే రకాల పళ్ళు కలిపి తినకూడదో తెలుసుకోండి.

కమలా పండు- పాలు

పరస్పర విరుద్ధ లక్షణాలున్న ఈ రెండింటినీ కలిపి తీసుకోవద్దు. అలా తింటే కడుపునొప్పి వస్తుంది.

pjimage

కమలా పండు- క్యారెట్

కడుపు మంట ఎసిడిటీ రాకుండా ఉండాలంటే ఈ రెండూ కలిపి తినకూడదు. ఆరెంజ్ రసం, క్యారెట్ సలాడ్ అసలు మంచి కాంబినేష‌న్ కానే కాదు.

pjimage (1)

దానిమ్మ -ఎండు ద్రాక్ష

రక్త వృద్ధికి ఎంతో సహాయపడే ఈరెండు పళ్ళు కలిపి తింటే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.

pjimage (2)

జామపండు అరటిపండు

ఎంతో విరివి గా దొరికే ఈ రెండు పండ్లు కలిపి తింటే కడుపునొప్పి ఖాయం.

pjimage (3)

నిమ్మకాయ-బొప్పాయి

ఈ పళ్ళు కలిపి తినడం వలన రక్తంలో ఇనుము శోషించడంలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బొప్పాయి గింజలు తీసేసే తినాలి.ఇక నిమ్మ రసంతో బొప్పాయి ముక్కలు తిననే కూడదు.

pjimage (4)

ఇటీవల కాలంలో పచ్చి కూరగాయలు పళ్ళు కలిపి సలాడ్లు చేసి పైన నిమ్మ రసం పిండుకొని తినడం సాధారణం అయిపోయింది. లేదా పాలు పోసుకొని కార్న్ ఫ్లేక్స్ తింటున్నారు.పైన చెప్పిన కాంబినేషన్లలో తింటే అవి అరగడం మాట అటుంచి అనేక సమస్యలు వస్తాయి. ఇక ఈ సలాడ్లు, ఫ్లేక్స్ తో పాటు నారింజ రసం తీసుకొంటుంటే
కాస్త గమనించుకోవాల్సిందే!

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)