Home / health / వయస్సు వారిగా సాధారణ రక్తపోటు ఎవరికీ ఎంత ఉండాలంటే..?

వయస్సు వారిగా సాధారణ రక్తపోటు ఎవరికీ ఎంత ఉండాలంటే..?

Author:

ఈమధ్యకాలంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య హై బీపీ లేదా లోబీపీ. ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఊబకాయం, మూత్రపిండాల సమస్య, హార్మోన్లలో మార్పులు, ఉప్పు ఎక్కువగా తినడం, వంశ పారంపర్య లక్షణం లాంటి అనేక కారణాల వాళ్ళ హై బీపీ వచ్చే అవకాశం ఉంది. కారణం ఏదైతేనేం, హై బీపీ సమస్య మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి హై బీపీని అశ్రద్ధ చేయకూడదు. ఇప్పుడు ఏ వయస్సు వారికి సగటున ఏ మోతాదులో బీపీ ఉంటే, ఆరోగ్యకరమో ఈ క్రింది చార్టు ద్వారా తెలుసుకోండి.
blood-pressure-chart

రక్తపోటు అనగానే అందరికి 120/80 గుర్తుకు వస్తుంది ఎందుకంటే అది సాధారణ రక్తపోటుకి కొలమాణం దానికి తగ్గట్లుగానే యువతి యువకులకు  (20-40 సంవత్సరాల వారికి) సాధారణ బీపీ 120/80 కి ఒక సంఖ్య అటు ఇటుగా ఉండాలి. వయసు పెరుగుతున్న కోద్ది సాధారణ రక్తపోటు సంఖ్య 130/85 ల లోకి పోతుంది. అదే విధంగా చిన్న పిల్లలకు సాధారణ రక్తపోటు పుట్టినప్పుడు 90/60 ఉండి క్రమంగా పెరుగుతుంది. అదే విధంగా పైన చార్టులో వయసుల వారిగా తక్కువ, ఎక్కువ రక్తపోటు ఎంత వుండోచ్చో కూడా తెలుసుకోవచ్చు.

(Visited 4,088 times, 1 visits today)