Home / General / పరీక్షల్లో 66 స్కూళ్ళు, కాలేజీల నుండి ఒక్కడు కూడా పాసవ్వలేదు.

పరీక్షల్లో 66 స్కూళ్ళు, కాలేజీల నుండి ఒక్కడు కూడా పాసవ్వలేదు.

Author:

ఒక్కడంటే ఒక్కడు కూడా పాసవ్వలేదు. మొత్తం 66 విద్యా సంస్థలు. అందులో 33 టెన్త్ స్కూళ్ళు, 33 ఇంటర్ కాలేజీలు మొత్తంగా 388 విద్యార్థులు. అందరూ పరీక్షలు రాశారు కాని అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇదేమి చోద్యం అనుకుంటున్నారా? మే 30 న జార్ఖండ్ లో రిలీజ్ ఐన టెన్త్, ఇంటర్ ఫలితాలలో 66 ప్రభుత్వ సంస్థల నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా పాస్ అవలేదు. దీనికి కారణం ఏమయి ఉంటుందా అని అందరు ఆశ్చర్యపోయారు. 66 స్కూల్స్ మరియు ఇంటర్ కాలేజెస్ ఉన్న ఈ రాష్ట్రం లో 148 మంది ఇంటర్ పరీక్ష ను రాయ గా 240 మంది పదో తరగతి పరీక్ష రాసారు. మొత్తం 388 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కనీసం ఒక్కరు కూడా పాస్ అవలేదు. దీనికి కారణం ఏంటో కనుక్కోవాల్సింది గా నేషనల్ ఎడ్యుకేషన్ సంఘ్ ఆదేశాలిచ్చింది.

10 and 12 Exams In Jharkhand

విషయం ఏంటని కనుకున్న అధికారులు, చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్ష లోనే ఫెయిల్ కావడం గమనించారు. ఇంత మంది ఒక్క ఆంగ్లం లోనే ఫెయిల్ అవడం దారుణమని, రాష్ట్రం లో విద్యా వ్యవస్థ నిదర్శనమని, ప్రభుత్వ సహకారం లేకే ఇంత అధ్వాన్నంగా తయారైందని, నేషనల్ ఎడ్యుకేషన్ సంఘ్ జనరల్ సెక్రెటరీ అమరనాథ్ ఝా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ లెక్కలు మాత్రం విరుద్దంగా ఉండడం గమనార్హం. ఈ కౌన్సిల్ లెక్కల ప్రకారం 57.9% పదో తరగతి విద్యార్థులు , 50 % ఇంటర్- సైన్స్ విద్యార్థులు, 60 % ఇంటర్- కామర్స్ విద్యార్థులు పాస్ అయినట్టు పేర్కొనడం విడ్డూరం. దీనిని బట్టే చెప్పొచ్చు ఇక్కడి ప్రభుత్వం, కౌన్సిల్స్ విద్యా వ్యవస్థ ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాయో? విద్యార్థుల విద్యావసరాల విషయం లో ఎడ్యుకేషన్ సిస్టం ఎంత అజాగ్రత్తగా, అశ్రద్ధగా ఉంది అనేది.

(Visited 284 times, 1 visits today)