Home / Inspiring Stories / క్యాబ్ కావాలా? ఫేస్”బుక్” చేసుకోవచ్చు…!

క్యాబ్ కావాలా? ఫేస్”బుక్” చేసుకోవచ్చు…!

Author:

Now We CanBook Uber Can By Using Facebook

మన జీవితాల్లో ఒక తప్పనిసరి అవసరంగా మారిపోతోంది ఫేస్‌బుక్. పొద్దున లేచింది మొదలు ఇంటర్నెట్ లో లాగిన్ అయ్యే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు టైం వేస్ట్ పని అనిపించుకున్న ఫేస్‌బుక్ ఇప్పుడు జీవితాల్లో మరో ముఖ్యమైన అంశం కాబోతోంది. ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ వల్ల లక్షలు సంపాదించే వారి దగ్గరనుంచీ,తమ సంస్థల అడ్వైర్టజ్మెంట్ల వరకూ చేసే వాళ్ళున్నారు. ఇప్పటి ఉద్యమాలకి సోషల్ నెట్ వర్కింగ్ సంస్థలు ఎంతగా ఉపయోగ పడ్డాయో చెప్పొచ్చు. అలా మన జీవితాల్లో భాగమైన ఫేస్‌బుక్ ఇప్పుడు కొన్ని సేవలను తన యూజర్లకు అందించటం ద్వారా మరింత చేరువ కావాలనుకుంటోంది. ఫేస్‌బుక్ ఇప్పుడు మరిన్ని సేవలను తన ఖాతాదారులకు అందించేందుకు ముందుకు వచ్చింది. తమ ఖాతాలను ఉపయోగించే వినియోగదారులు నేరుగా క్యాబ్ సర్వీస్‌లను బుక్ చేసుకునే వీలు కల్పించింది. ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ‘ఉబర్‌’తో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది.ఇక ఇప్పటి నుండీ ఫేస్‌బుక్ వినియోగదారులు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌ల ద్వారానే నేరుగా క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాబ్ బుకింగ్ కోసం ఆ సంస్థ ప్రవేశ పెట్టిన ఉబర్ యాప్‌ ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

మన దేశంలో ఇంకా మొదలు కాలేదు కానీ ప్రయోగాత్మకంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లను ప్రారంభించనున్నామని ఫేస్‌బుక్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాల్లో రవాణా సేవలను అందించే ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని అంటున్నారు. సో, మున్ముందు మన దగ్గర కూడా నేరుగా ఫేస్‌బుక్ నుంచే క్యాబ్‌లను బుక్ చేసుకునే సదుపాయం రాబోతుందన్నమాట!ఇది గనక సక్సెస్ ఐతే ఇక ముందు ఇదే తరహా సేవలని మరిన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటే సినిమా టికెట్, ప్రైవేటు విమాన యాన సంస్థల లో విమాన సరీసు టికెట్లనూ మన సొంత ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా నే బుక్ చేసేందుకు వీలుగా చేస్తారట. ఇక ఇప్పటికే తమ సంస్థల ప్రమోషన్లు చేసుకుంటూన్న ప్రైవేటు యాజమాన్యాలూ ఫేస్‌బుక్ తో జతకట్టాలని చూస్తున్నాయట. అంటే తమ అమ్మకాలని ఫేస్‌బుక్ ద్వారానే సాగిస్తారన్న మాట. ఇప్పటికే ఈ పద్దతి సాగుతోంది ఎన్నో చిన్న సంస్థలు తమ ఆర్డర్లను తమ ఫేస్‌బుక్ పేజీల ద్వారా,వాట్స్ ఆప్ నెంబర్ ల ద్వారా తీసుకుంటున్నాయి.

(Visited 887 times, 1 visits today)