Home / Inspiring Stories / ఇక నుండి 30 నిముషాల ముందు వరకు రైలు టికెట్లు ఆన్‌లైన్ లో కొనుక్కోవచ్చు.

ఇక నుండి 30 నిముషాల ముందు వరకు రైలు టికెట్లు ఆన్‌లైన్ లో కొనుక్కోవచ్చు.

Author:

Indian Railways

రైలు ప్రయాణీకులకు ఒక మంచి వార్త మరియు ఒక చెడ్డ వార్త. ముందుగా మంచి గురించి మాట్లాడుకుందాం. రైలు టికెట్ ఆన్‌లైన్ బుకింగ్ అంటే అదో పెద్ద పని అని, ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్ అని, చాలా మంది రెండు, మూడు నెలల ముందు నుండే టిక్కెట్లు ఆన్‌లైన్ లో బుక్ చేసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితితుల్లో రైలు టికెట్ దొరకడమే గగన౦ అయితుంది. ఇలాంటి భాదలకు పరిస్కారం చూపుతూ భారతీయ రేల్‌వేస్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి రైలులో మిగిలిన, రద్దు చేయబడిన టిక్కెట్లని రైలు బయలుదేరే సమయం కన్నా 30 నిముషాల ముందు వరకు ఆన్‌లైన్ లో కొనుక్కొవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరం.

ఇప్పుడు చెడ్డ వార్త, ఇకపై టిక్కెట్లు ముందుగా బుక్ చేసుకొని తర్వాత రద్దు చేసుకుంటే రద్దు ఛార్జీలని దాదాపు రెట్టింపు చేసింది. రెండవ తరగతి టికెట్ ని 48 గంటల ముందు రద్దు చేసుకుంటే ఇంతకీ ముందు ఉన్న 30 రూపాయల ఛార్జీని 60 రూపాయల కి పెంచారు. మిగిలిన టికెట్ రద్దు దరల పట్టిక కింద చూడండి.
2వ తరగతి స్లీపర్- పాత రద్దు చార్జీ 60- కొత్త రద్దు చార్జీ 120
3వ తరగతి ఏసి- పాత రద్దు చార్జీ 90- కొత్త రద్దు చార్జీ 180
2వ తరగతి ఏసి- పాత రద్దు చార్జీ 100- కొత్త రద్దు చార్జీ 200

రైలు బయలుదేరే సమయానికి 48 గంటల నుండి 12 గంటల మధ్య టికెట్ రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 25% ని రద్దు ఛార్జిగా వసూలు చేస్తారు.

రైలు బయలుదేరే సమయానికి 12 గంటల నుండి 6 గంటల మధ్య టికెట్ రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 50% ని రద్దు ఛార్జిగా వసూలు చేస్తారు.

ఒకసారి రైలు బయలుదేరిన తర్వాత టికెట్ రద్దు చేస్తే ఎటువంటి డబ్బులు వాపసు ఇవ్వరు. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఒకేసారి రెండు కొత్త నిర్ణయాలతో భారతీయ రేల్‌వేస్ ప్రయాణీకులని ఒకింత ఆనందానికి ఒకింత భాదని మిగిల్చింది.

(Visited 4,054 times, 1 visits today)