Home / Inspiring Stories / ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 3 నెలల వరకు ఛార్జింగ్ తగ్గదు.

ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 3 నెలల వరకు ఛార్జింగ్ తగ్గదు.

Author:

Brakethrough Charging

ఇప్పుడు ఎక్కడ చూసిన, ఎవరి చేతిలో చూసిన మనకు కనిపించేది స్మార్ట్ ఫోన్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్. ఈ స్మార్ట్ ఫోన్స్ చూడటానికి భాగున్న చార్జింగ్ ఎక్కువ సేపు నిలవదు. ఇక నెట్ ఉపయోగిస్తే మరీ  తొందరగా చార్జింగ్ తగ్గిపోతుంది. ఈ ఒక్క సమస్య చాలా మంది వినియోగదారులను ఇబ్బంది పెట్టే విషయం. ఈ ఇబ్బంది నుండి బయటపడేందుకు చాలా మంది పవర్ బ్యాంక్ లు వాడుతున్నారు. ఇక ఇప్పుడు అలాంటి అవసరం రాదు అంటున్నారు శాస్త్రవేత్తలు.

            ఇక ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ ను ఏ విధంగా ఉపయోగించుకున్న ఒక్క పర్సెంట్ కూడా చార్జింగ్ తగ్గిపోదని అంటున్నారు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా…! మీకున్న సందేహానికి బ్రేక్‌త్రూ టెక్నాలజీతో సమాధానం దొరుకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఓ కొత్త బ్యాటరీని కనిపెట్టారు. చాలా కష్టపడి ఈ విధమైన బ్యాటరిని కనిపెట్టారట! అయితే ఈ బ్యాటరిలో ఉపయోగించిన వైర్లు మన వెంట్రుకల కంటే పలుచగా ఉన్నాయట. బ్యాటరీ చార్జింగ్ దిగిపోకుండా, ఎల్లప్పుడూ ఒకేవిధంగా బ్యాటరీ పవర్ నిలిచేందుకు ఈ గోల్డ్ నానో వైర్లు సహాయపడతాయని చెబుతున్నారు. ఈ బ్యాటరీని ఒక్క సారి చార్జింగ్ పెడితే దాదాపు మూడు నెలలు వస్తుంది అంటున్నారు. అలాగే ఇలాంటి బ్యాటరీని ఒక్క స్మార్ట్ ఫోన్స్ కే కాదు అన్ని రకాల ఫోన్స్ కి సరిపోయే విధంగా తయారు చేస్తున్నారట. అతి త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఈ బ్యాటరీ కోసం చాలా మంది చూస్తున్నారని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలిపారు.

Must Read: స్మార్ట్ ఫోన్ పోతే గూగుల్ మ్యాప్స్ సహాయంతో కనిపెట్టవచ్చు.

(Visited 11,910 times, 1 visits today)