Home / Entertainment / పవర్ స్టార్ ఆడియో ఫంక్షన్ గెస్ట్ గా అప్పుడు సూపర్ స్టార్,ఇప్పుడు ఎన్టీఆర్.

పవర్ స్టార్ ఆడియో ఫంక్షన్ గెస్ట్ గా అప్పుడు సూపర్ స్టార్,ఇప్పుడు ఎన్టీఆర్.

Author:

NTR attending power star audio

ఈ మద్య కాలంలో ఇండస్ట్రీ ఆడియో ఫంక్షన్లలో చిన్న సినిమాలకు పెద్ద హీరోలు చీఫ్ గెస్టులుగా రావడం సందడి చేయడం మనకు తెలిసిందే. ముఖ్యంగా చిన్న చిత్రాల ఆడియో ఫంక్షన్లకు పెద్ద హీరోలు వస్తే మంచి క్రేజ్ వస్తుందని బావిస్తున్నారు. మొదట ‘ఇష్క్’ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ వచ్చి రీలిజ్ చేయ్యడంతో ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ వచ్చి మంచి సక్సెస్ సాదించింది. ఇక ఈ మద్యా అడపదడప కొందరు చిన్న సినిమాలకు రావడం వారి అభిమానన్ని తెలియాజేస్తున్నారు. ఇలా పెద్ద హీరోలు రావడం కూడా చిత్రాలపై ప్రభావం ఉంటుందని కొందరు నమ్ముతున్నారు. తాజాగా నాన్నకు ప్రేమతో చిత్రంతో మంచి సక్సెస్ సాధించిన ఎన్టీఆర్ ఇప్పుడు పవర్ స్టార్ ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా వెళ్లనున్నారు. పవర్ స్టార్ అంటే మన కళ్యాణ్ కాదు కన్నడ పవర్ స్టార్ అన్నమాట.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చక్రవ్యూహ’. ఈ సినిమా కోసం ఎన్‌టిఆర్‌… తన స్నేహితుల కోరిక మేరకు ఓ పాట కూడా పాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ ఆడియో రిలీజ్ కు కూడా అటెండ్ అవబోతున్నాడట.

అంతకు ముందు తెలుగులో ప్రభంజనం సృష్టించిన దూకుడు సినిమా రీమేక్‌గా పవర్ పేరుతో కన్నడంలో పునీత్ రాజ్ తీశారు. అప్పుడు మన సుపర్ స్టార్ మహేష్‌బాబు వెళ్ళి తన చేతుల మీదుగా ఆడియోని విడుదల చేసి వచ్చాడు.

‘చక్రవ్యూహ’ చిత్రం ఆడియో వేడుకను ఫిబ్రవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ ను ఆహ్వానించారట. ఎన్టీఆర్ కు పునీత్ కు మధ్య కూడా మంచి స్నేహం నెలకొన్నట్టు తెలుస్తోంది. అదీకాక ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఎన్టీఆర్ కు 25వ సినిమా అయితే.. ‘చక్రవ్యూహ’ సినిమా పునీత్ రాజ్ కుమార్ కెరీర్ లో కూడా 25వ చిత్రం కావడం విశేషం.

(Visited 448 times, 1 visits today)