Home / Entertainment / మొదలైన జనతా గ్యారెజ్.

మొదలైన జనతా గ్యారెజ్.

Author:

Janatha-Garage-NTR-upcoming-movie

‘జనతా గ్యారేజ్’ ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో సినిమా లాంటి ఒక బ్లాక్ బ్లాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా. ఇక ఈ సినిమా డైరెక్టెర్ కొరటాల శివ కూడా ఒక కారణం, ఎందుకంటే తను తీసిన రెండు సినిమాలు ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’తో టాప్ డైరెక్టెర్ లిస్టులో చేరిపోయాడు. శివ సినిమాలో మనం చూస్తే ఒక విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది, సినిమా స్టోరిని మొత్తం ఒక డైలగ్ లో చెప్పెస్తాడు. మిర్చి సినిమాలో’ ప్రేమిస్తే పోయెదేముంది డ్యూడ్ మహ అయితే తిరిగి ప్రేమిస్తారు’ అనే డైలగ్ లో మనకు సినిమా స్టోరి తెలుస్తుంది. అలాగే శ్రీమంతుడు సినిమాలో ‘ఊరునుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి ఇవ్వకపోతే లావు అవుతావు’ అనే డైలగ్ లో సినిమా కంటేంట్ మొత్తం ఉంటుంది. ఇక ఇప్పుడు జనతా గ్యారెజ్ లో ఎలాంటి డైలాగ్ ఉంటుందో అని చాలమంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

జనతా గ్యారెజ్ సినిమా నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమా గురించి దర్శకుడు శివ మాట్లాడుతూ… ఈ సినిమా చాలా స్టైలిష్ గా ఎమోషనల్ గా ఉంటునే, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఉంటుందని ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్‌ను మరోసారి బలంగా చూపే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్న అని శివ తెలియజేశాడు.

(Visited 175 times, 1 visits today)